ఇంతకంటే నీచమైన తల్లిదండ్రులు ఉండరు.. పిల్లలతో వీరు ఏం చేయించారో తెలుసా?

మనం సినిమాల్లో ఒక రౌడీ పిల్లలను కిడ్నాప్‌ చేసి వారితో భిక్షాటన చేయిస్తూ ఉంటాడు.అలా బిక్షాటన చేయిస్తున్న సమయంలో హీరో వారిని కాపాడి ఆ రౌడీని చావ చితక కొడతాడు.

 Dubai Police Arrested Parents Who Forced Son To Beg 1-TeluguStop.com

ఇలాంటి సీన్స్‌ ఎన్నో సినిమాల్లో చూశాం.కాని కన్న తల్లిదండ్రులే పిల్లలను బిక్షాటన చేయించడం మాత్రం మనం ఇప్పటి వరకు ఎప్పుడు చూసి ఉండం.

తల్లిదండ్రులు తాము చనిపోయే వరకు ఏదో ఒక పని చేసి పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అంతే తప్ప పిల్లలపై బతకాలని, అది కాకుండా చిన్న పిల్లలతో బిక్షాటన చేయించి బతకాలని భావించరు.

ఇంతకంటే నీచమైన తల్లిదండ్రులు

ఏ తల్లిదండ్రులు చేయని పనిని వీరు చేశారు.దుబాయిలో ఉంటున్న ఒక జంట తమ ముగ్గురు పిల్లలను బిక్షాటన చేయిస్తున్నారు.లక్షలు సంపాదిస్తున్న పిల్లల సాయంతో వారు హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నాడు.కేవలం ఏడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లాడిని గుడివాడిగా నటింపజేసి ఆ తల్లిదండ్రులు కొడుకుతో బిక్షాటన చేయిస్తున్నాడు.

దుబాయిలో బిక్షాటన నేరం.అందుకే అక్కడ ఎక్కువ మంది బిక్షగాళ్లు ఉండరు.

ఉన్న ఒక్కరి ఇద్దరిని స్థానికులు పాపం అంటూ వదిలేస్తారు.అలా ఏడు సంవత్సరాల గుడ్డి పిల్ల వాడు అవ్వడంతో చాలా రోజులుగా ఆ పిల్లాడిని ఎవరు ఏమనడం లేదు.

రంజాన్‌ మాసం సందర్బంగా ఆ పిల్లాడికి మంచి డబ్బులు వచ్చాయి.తల్లిదండ్రులు లక్షల రూపాయలు పోగు చేసుకున్నారు.ఇలాంటి సమయంలో ఆ పిల్లాడిని పోలీసులు గుర్తించారు.అతడి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో దగ్గరకు వెళ్లి గట్టిగా ప్రశ్నించడంతో తనకు కళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

తన తల్లిదండ్రులు ఇలా చేయిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.తన తల్లిదండ్రుల బలవంతం మీదే ఇలా చేస్తున్నానంటూ చెప్పడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆ బాలుడికి కొద్ది దూరంలో నిల్చుని గమనిస్తూ ఉన్నారు.

సాయంకాలం అవ్వడంతో ఆ పిల్లాడిని తీసుకు వెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చారు.

ఇంతకంటే నీచమైన తల్లిదండ్రులు

ఆ సమయంలో బాలుడు నేను బిక్షమెత్తను అంటూ ఏడ్వడంతో కొట్టేందుకు కూడా వెనకాడకుండా బిక్షం ఎత్తాల్సిందే అంటూ ఆ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ విషయం అక్కడే ఉన్న పోలీసులు విని వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.తమ ఇద్దరు బిడ్డలతో కూడా ఇదే పని చేయిస్తున్నట్లుగా ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

దుబాయిలో బిక్షాటనకు 3 నెలల జైలు శిక్ష ఉంటుంది.మరి కొడుకుతో బిక్షమెత్తించిన కారణంగా వీరికి కనీసం రెండు సంవత్సరాలు అయినా జైలు శిక్ష ఉంటుందని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube