భారత విధ్యార్దులకు బ్రిటన్ రెడ్ కార్పెట్....ఆ రెండు నిర్ణయాలతో భారీ లబ్ది...

భారత్ నుంచీ విదేశాలు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో మంది భారతీయ విద్యార్ధులు ఆసక్తి చూపుతుంటారు.

అక్కడే చదువుకుని ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడి అక్కడి విద్యా విధానానికి కావాల్సిన అన్ని తర్ఫీడులు పొందుతారు.

అయితే ఇలాంటి వారి ఆశలపై కరోనా నీళ్ళు చల్లింది.ముఖ్యంగా అమెరికా వెళ్లి చదువుకోవడానికి మొగ్గు చూపే విద్యార్ధులు అక్కడి కరోనా, వీసా ఆంక్షల నేపధ్యంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులలో బ్రిటన్ భారత విద్యార్ధులకు రెడ్ కార్పెట్ పరిచింది.

కరోనా ఆంక్షలు సడలిస్తూ తమ దేశంలోకి వచ్చి చదువుకోండి అంటూ భారీ ఆఫర్లు కూడా ప్రకటించింది.అంతేకాదు 2020 లో బ్రిటన్ లో చదుకునే భారత విద్యార్ధుల సంఖ్యను 2021 నాటికి దాదాపు 20 శాతం రెట్టింపు చేసింది.

ప్రస్తుతానికి 2021 కి గాను 3200 మందికి బ్రిటన్ లో చదుకునే అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.మరే ఇతర దేశానికి ఈ స్థాయిలో సంఖ్య పెంచలేదని నిపుణులు అంటున్నారు, బ్రిటన్ ఈ తాజా నిర్ణయంతో భారతీయ విద్యార్ధులకు ఊరట ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

ఇదిలాఉంటే కరోనా నేపధ్యంలో పలు దేశాలపై విధించిన ఆంక్షలను సడలించిన బ్రిటన్ భారత్ ను రెడ్ లిస్టు నుంచీ అంబర్ జాబితాకు మార్చింది.బ్రిటన్ ఈ తాజా రెండవ నిర్ణయంతో భారతీయ విద్యార్ధులకు భారీ లబ్ది చెకూరనుందట ఎలాగంటే.

గతంలో బ్రిటన్ వెళ్ళే వారిని పడి రోజుల పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్వారంటైన్ లో ఉంచే వారి అందుకు అయ్యే ఖర్చులు విద్యార్ధులే భరించాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు అంబర్ లిస్టు లో ఉండటం వలన విద్యార్ధులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన అవసరం లేదు వారి వారి కాలేజీ హాస్టల్స్ లేదంటే వారు ఎంచుకునే క్వారంటైన్ సెంటర్స్ లో ఉండవచ్చు.

అలాగే బ్రిటన్ విదేశీ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన పోస్ట్ స్టడీ వీసా వలన కూడా భారత విద్యార్ధులకు మేలు జరగనుంది.ఈ వీసా ప్రకారం చదువు పూర్తయిన తరువాత రెండేళ్ళ పాటు ఉద్యోగం కోసం బ్రిటన్ లోనే ఉండేలా ఈ వీసా తో వెసులు బాటు కల్పించింది బ్రిటన్ ప్రభుత్వం, దాంతో అత్యధికంగా బ్రిటన్ లో ఉన్న భారతీయ విద్యార్ధులకు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు