అఖండ సీక్వెల్ లో మోక్షజ్ఞ ఉన్నాడా లేదా.. ఆ ప్రశ్నలకు అసలు క్లారిటీ ఇదే!

తాజాగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అలాగే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబినేషన్లో అఖండ2 సినిమా మొదలైన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగాయి.

ఈ పూజా కార్యక్రమాలకు బాలయ్య బాబు అలాగే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో పాటుగా భలే బాబు కూతుర్లు కుటుంబ సభ్యులు మూవీ మేకర్స్ పాల్గొన్నారు.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Brahmani, Tejaswini At Akhanda Thaandavam Movie Opening, Brahmani, Akhanda 2, To

అఖండ తాండవం మూవీ ఓపెనింగ్ లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవాల్సింది బాలయ్య.కానీ అక్కడ అందరికన్నా ఎక్కువ హైలెట్ అయ్యింది ఆయన కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజశ్వినిలు( Nara Brahmani , Tejashwini ).తేజశ్వని సమర్పకురాలిగా, బ్రాహ్మణి తండ్రి సినిమాకి క్లాప్ కొట్టారు.బాలయ్య కుమార్తెలు ఎంత పద్దతిగా సంప్రదాయంగా ఉంటారో అందరికి తెలుసు.

ఇప్పుడు తండ్రి మూవీ ఓపెనింగ్ లో కుమార్తెలిద్దరూ ఎంతగా హైలెట్ అయ్యారో సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే అఖండ 2 మూవీ( Akhanda 2 movie ) ఓపెనింగ్ వీడియోస్ చూస్తే అర్ధమైపోతుంది.

Brahmani, Tejaswini At Akhanda Thaandavam Movie Opening, Brahmani, Akhanda 2, To
Advertisement
Brahmani, Tejaswini At Akhanda Thaandavam Movie Opening, Brahmani, Akhanda 2, To

తేజస్విని, బ్రాహ్మణి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియోస్, ఫొటోస్, బాలయ్యతో కుమార్తెల ఇద్దరి ఫొటోస్ చూస్తే అభిమానులకి ఒక కోరిక పుట్టింది.అదేమిటంటే అదే అక్కడ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఉంటే ఎంత బావుంటుందో అని.అసలే ఈ ఏడాదే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారైంది.మోక్షజ్ఞ న్యూ మేకోవర్ చూసి నందమూరి అభిమానులు మైమరచిపోయారు.

అలాంటి సమయంలో బాలయ్య మూవీ ఓపెనింగ్ లో అక్కలతో పాటుగా మోక్షజ్ఞ కూడా ఉంటే అది అభిమానుల ఆనందానికి అవధులు ఉండేవి కావని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు