రామ్ తో రిస్క్ చేస్తున్న బోయపాటి..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం లింగుసామి డైరక్షన్ లో ది వారియర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ టాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కు సంబందించి ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

అఖండతో అఖండమైన విజయం అందుకున్న బోయపాటి శ్రీను తను రామ్ తో చేస్తున్న నెక్స్ట్ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తుంది.ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ని కూడా భారీగా పెంచుతున్నాడని టాక్.

మాములుగానే 40 కోట్ల బడ్జెట్ హీరో అయిన రామ్ తో ఈసారి 80 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడట బోయపాటి శ్రీను.ఇది నిజంగానే చాలా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు.

Advertisement

బోయపాటి శ్రీను, రామ్ కాంబో మూవీ 80 కోట్లతో తీస్తే ఆ మూవీ టార్గెట్ 100 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.మరి రామ్ మార్కెట్ అంతా ఉందా లేదా అన్నది కూడా ఆలోచించాల్సిందే.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు