తిట్టిన నోటితోనే ఇక పొగడాలి....!

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెసు పార్టీకి రాష్ర్ట అద్యక్షుడిగా పని చేసిన విజయనగరం జిల్లా నాయకుడు బొత్స సత్యనారాయణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.

! ఒకప్పుడు ఆయన భాజపాలో చేరతారనే వార్తలు బాగా షికారు చేశాయి.

కాని ఆ పార్టీ మొండి చేయి చూపించడంతో వైకాపాలో చేరుతున్నాడు.వైఎస్‌ జగన్‌ కూడా ఇందుకు పచ్చ జెండా ఊపాడట.

Botsa Satyanarayana To Join YSRCP-Botsa Satyanarayana To Join YSRCP-Telugu Polit

మరి పార్టీలో ఏం పదవి ఇస్తారో చూడాలి.కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ ప్రతి రోజూ జగన్‌ను నానా బూతులు తిట్టాడు.

ఆ తిట్టిన నోటితోనే ఇక పొగడ్తలు మొదలుపెడతాడేమో.ఎంతటి నాయకుడికైనా అధినేతను పొగడక తప్పదు కదా.సత్తిబాబుకు కాంగ్రెసు మీద నమ్మకం పోయినట్లు ఉంది.ఇక ఆ పార్టీ బతికి బట్ట కట్టదని డిసైడైపోయాడా? లేక పార్టీలో తగిన గౌరవం ఇవ్వడం లేదా? జగన్‌ ఎంతటివారిపైనా పురుగుల్లా చూస్తాడని అంటారు.మరి పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా పని చేసిన బొత్సకు వైకాపాలో తగిన గౌరవం లభిస్తుందా? జగన్‌కు నమ్మిన బంట్లే బయటకు వచ్చేశారు.మరి విజయనగరం రాజావారు ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి.

Advertisement
ఇరాన్‌లో రక్తపు వర్షం.. బీచ్ మొత్తం ఎర్రగా.. దేవుడి కోపమేనా.. వీడియో వైరల్..

తాజా వార్తలు