జగన్‌ అభిమానుల వార్నింగ్‌ తో అదిరింది కమెడియన్స్‌ క్షమాపణలు

జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది కామెడీ షో కొత్తగా బొమ్మ అదిరింది అంటూ పునః ప్రారంభం అయ్యింది.

మొదటి ఎపిసోడ్ లో ఒక స్కిట్‌ లో ఒక కమెడియన్‌ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఇమిటేషన్ చేయడం జరిగింది.

ఆ సందర్భంగా సీఎం జగన్ ని కమెడియన్స్‌ అవమాన పరిచినట్లుగా వ్యవహరించారని వైకాపా నాయకులు మరియు జగన్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా ద్వారా ఆ కమెడియన్స్‌ ను హెచ్చరించడంతో పాటు కొందరు స్వయంగా కాల్‌ చేసి బెదిరించారని తెలుస్తోంది.

సోషల్ మీడియా ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా వస్తున్న విమర్శలు మరియు బెదిరింపుల కారణంగా కమెడియన్ రియాజ్ మరియు ఎక్స్ ప్రెస్ హరి సోషల్ మీడియా వేదికగా జగన్ కు మరియు ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.తాము కేవలం ప్రేక్షకులను నవ్వించడానికి మాత్రమే అలా చేశామని తమకు ఎలాంటి చెడు ఉద్దేశం జగన్‌ గారి గురించి లేదంటూ పేర్కొన్నారు.

హరి మాట్లాడుతూ వ్యక్తిగతంగా నాకు జగన్ గారు అంటే చాలా అభిమానమని తాను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం గానీ స్కిట్లు చేయడం కానీ చేయనుఅన్నారు.ఇకపై ఎప్పుడూ కూడా జగన్ గారి గురించి తప్పుగా చూపించడం గాని కామెడీ చేయడం గాని చేయమని ఈ ఒక్కసారికి పెద్ద మనసుతో క్షమించండి అంటూ జగన్ అభిమానులను హరి వేడుకొన్నాడు.

Advertisement

ఇక ఈ మధ్య కామెడీతో నవ్విస్తున్న రియాజ్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ జగనన్న ను ఏమి తప్పుగా అనలేదని ఆయన్ను ఇమిటేట్‌ చేసినందుకు క్షమించాలి.ఆయన అంటే తనకు కూడా చాలా అభిమానమని కామెడీ స్కిట్‌ లో ఆయన్ను ఇమిటేట్‌ చేసినందుకు కొందరు అభిమానులు అభినందించినా కొందరు మాత్రం బాధపడ్డట్లుగా తమ దృష్టికి వచ్చింది అందుకే తాము క్షమాపణ చెప్పేందుకు ముందుకు వచ్చారన్నారు.

జగనన్న అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నామని ఇకపై ఎప్పుడు ఇలా జరగదు అంటూ ఇద్దరు కమెడియన్స్ పేర్కొన్నారు.ఇప్పటికైనా జగన్ అభిమానులు శాంతి ఇస్తారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు