తాగుబోతు అంటూ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్?

బాహుబలి( Bahubali ) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ( Prabhas )ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అయితే ఈయన నటించిన ఆది పురుష్ ( Adipurush ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎలాంటి విమర్శలను ఎదుర్కొందో మనకు తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు నుంచి వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది.ఇలా ఎన్నో వివాదాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకుపోగా ప్రభాస్ లుక్ పట్ల దారుణమైన కామెంట్స్ వచ్చాయి.

ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి( Vivek Agnihothri ) సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే ఈయన ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈ సందర్భంగా ఈయన గతంలో కూడా ఒకసారి ప్రభాస్ గురించి మాట్లాడుతూ.

Advertisement

ప్రభాస్ అసలు నటుడే కాదని ఆయనకు నటనే రాదు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.అయితే తాజాగా మరోసారి కూడా వివేక్ మాట్లాడుతూ.పురాణ గాథలకు స్టార్‌ హీరోలను ఎంచుకుంటే రిజెల్ట్ జీరో అని తెలిపారు.

వారు కష్టపడే సినిమా చేసిన ఆదిపురుష్ కొచ్చిన ఫలితమే రిపీటవుతుందని అగ్నిహోత్రి అన్నారు.ప్రతి రోజూ రాత్రి పీకలదాగా తాగి తెల్లవారి దేవుడిగా కనిపిస్తే.

చూసే ప్రజలు మూర్ఖులు కాదంటూ.ప్రభాస్ పై ఇండైరెక్ట్ కామెంట్స్‌ చేస్తూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ మధ్యకాలంలో దేవుడి పాత్రలలో నటించింది ప్రభాస్ మాత్రమే ఈ క్రమంలోనే ఈయన పరోక్షంగా ప్రభాస్ ని అవమానించారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు