చిన్నప్పుడే ఆ స్టార్ హీరోయిన్ కి ఐ లవ్యూ చెప్పిన హీరో.. ఎవరంటే?

ప్రేమ అనేది ఎవరికి ఎప్పుడు పుడుతుందో, ఎక్కడ పుడుతుందో తెలియదు.ప్రేమ గుడ్డిది అని చాలామంది అంటుంటే వింటాం.

కానీ ఆ ఫీలింగ్ ప్రేమలో ఉన్న వాళ్లకు మాత్రమే తెలుస్తుంది.ఇక ముఖ్యంగా ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని కూడా అంటుంటారు.

అది కూడా నిజమే.ఎందుకంటే ప్రేమ అనేది తమకంటే చిన్న వాళ్లతో లేదా పెద్ద వాళ్ళతో కూడా పుట్టే సందర్భాలు ఉన్నాయి.

ఉదాహరణకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు.అందులో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన కంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Advertisement

ప్రియాంక చోప్రా కూడా తనకంటే చిన్న వయసులో ఉన్న వాడిని పెళ్లి చేసుకుంది.సమాజం కూడా వాళ్ళ ప్రేమను అంగీకరించింది.

అలా చిన్న వయసులోనే ఎవరిపైననైనా ప్రేమ పుట్టడం సహజం.మామూలుగా చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న సమయంలో కొందరి పిల్లలకు టీచర్లు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.

పైగా కొన్ని కొన్ని సమయాలలో ప్రపోజ్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి.అలా ఎంతోమంది పిల్లలు తమ కంటే పెద్ద వాళ్లను ఇష్టపడుతుంటారు.

ఇక ఓ హీరో కూడా చిన్నప్పుడే ఓ స్టార్ హీరోయిన్ కు ఐ లవ్యూ చెప్పాడు.ఇంతకీ అతనెవరో తెలుసుకుందాం.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అమీర్ ఖాన్.ఇక ఈయన ఎంతో మంది స్టార్ హీరోయిన్ లతో నటించాడు.అందులో ఒకరు జుహీ చావ్లా కూడా ఉంది.

Advertisement

ఇక ఈమెతో కలిసి పలు సినిమాలలో నటించాడు.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో 1988లో ఖయామత్ సే ఖాయమత్ అనే సినిమా తెరకెక్కింది.

ఇక ఈ సినిమా అప్పట్లో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ వెళ్లాడట.ఇక ఇమ్రాన్ ఖాన్ ఆమెను సెట్ లో చూసి ఆమె అందానికి పడిపోయాడట.

అంతే.వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఐ లవ్ యు చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడట ఇమ్రాన్ ఖాన్.

ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆరేళ్ల వయసులో మాత్రమే ఉన్నాడట.ఇమ్రాన్ ఖాన్ ప్రపోజ్ చేయడంతో తను ఆశ్చర్యపోయిందట.వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు నీకు ఆంటీజీని అని చెప్పి అక్కడినుంచి పంపిందట.

ఇక ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ కూడా చాలా ఇంటర్వ్యూలలో తెలిపాడు.ఇప్పటికీ ఆ హీరోయిన్ అంటే తనకు ఇష్టమని తెలిపాడు.

జుహీ చావ్లా కూడా ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలో తెలిపింది.ఇమ్రాన్ ఖాన్ అమీర్ ఖాన్ ను మామ అని పిలిచే వాడని, చాలా క్యూట్ గా ఉండేవాడని.

ఓ సారి తనను ప్రపోజ్ కూడా చేశాడని తెలిపింది.ఇప్పటికీ ఆ విషయం గుర్తొస్తే బాగా నవ్వొస్తుందని చాలాసార్లు తెలిపింది.

ఇక ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు