Actress Alia Bhatt Bollywood: కూతురికి జన్మనిచ్చిన బాలీవుడ్ నటి అలియా భట్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణబీర్ కపూర్ ఆలియా భట్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివాహ బంధంతో ఒకటైన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా పెళ్లి జరిగిన రెండు నెలలకే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా అలియా భట్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తాను కమిట్ అయిన సినిమాలన్నింటిని కూడా పూర్తి చేశారు.

ఇకపోతే రణబీర్ కపూర్ ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె బేబీ బంప్ తోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా తరచూ ఈమె బేబీ బంప్ ఫోటోషూట్లను చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.

ఇకపోతే తాజాగా రణబీర్ కపూర్ ఆలియా భట్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.నేడు ఉదయం అలియా భట్ ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ లో అడ్మిట్ కాగా కొద్ది క్షణాల క్రితం ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులు తెలియజేశారు.ఈ క్రమంలోనే రణబీర్ ఆలియా భట్ ఇద్దరు కూతురికి జన్మనిచ్చారని తెలియడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు