'సైంధవ్'లో బాలీవుడ్ స్టార్.. ఈసారి వెంకీ గట్టగానే కొట్టేలా ఉన్నాడుగా!

టాలీవుడ్ లో ప్రెజెంట్ సీనియర్ హీరోలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.ఎవరికీ వారు తమ లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఒకదాని తర్వాత మరో సినిమాను పూర్తి చేస్తున్నాడు.వారు ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది.

విక్టరీ వెంకటేష్, నాగార్జున.ఈ ఇద్దరు రేసులో కాస్త వెనుకబడి ఉన్నారు.

అయితే విక్టరీ వెంకటేష్ ప్రెజెంట్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాను రీసెంట్ గా పోస్టర్ ద్వారా రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసారు.

Advertisement
Bollywood Actor Nawazuddin Siddiqui Joins The Venkatesh Saindhav, Venkatesh, Sai

మరి వెంకీ తన కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా అయినా 75వ సినిమాను ఎవరితో చేస్తాడా అని అంతా ఎదురు చూసారు.అయితే ఈ సినిమా కోసం హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను కు ఛాన్స్ ఇచ్చాడు వెంకీ.

సబ్జెక్ట్ అనౌన్స్ మెంట్ తోనే అందరిలో మంచి ఆసక్తి రేగగా.ఇప్పుడు ఈ సినిమా నుండి ఆసక్తికర గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Bollywood Actor Nawazuddin Siddiqui Joins The Venkatesh Saindhav, Venkatesh, Sai

ఈ గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంది అనే చెప్పాలి.ఈ సినిమాతో వెంకీ కంబ్యాక్ ఇస్తాడు అని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.శైలేష్ కొలను ఈ సినిమాతో వెంకటేష్ కు మంచి హిట్ అందివ్వడం ఖాయం అంటూ దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.

ఇక వెంకీ 75వ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాయగా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

Bollywood Actor Nawazuddin Siddiqui Joins The Venkatesh Saindhav, Venkatesh, Sai
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు భాగం కాబోతున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఎన్నో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు.

Advertisement

మరి ఈ సినిమాలో ఈయన నటించడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు