ట్రంప్‌పై హత్యాయత్నం : వెలుగులోకి పోలీస్ అధికారి బాడీ‌కామ్ ఫుటేజ్.. సీక్రెట్ సర్వీస్‌పై విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై( Donald Trump ) హత్యాయత్నంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో పెన్సిల్వేనియాలోని బట్లర్ ( Butler, Pennsylvania )ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు.

దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు.కాల్పుల శబ్ధం వినిపించిన వెంటనే ట్రంప్ పోడియం కిందకి చేరి తనని తాను రక్షించుకున్నారు.

వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయనకు రక్షణ కవచంలా నిలిచారు.అప్పటికే బుల్లెట్ ట్రంప్ కుడి చెవి మీదుగా వెళ్లి గాయమైంది.

అనంతరం భారీ భద్రత మధ్య ఆయనను ఆసుపత్రికి తరలించారు.మరోవైపు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి.

Advertisement

దుండగుడిని మట్టుబెట్టాడు.ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.అయితే యూఎస్ సీక్రెట్ సర్వీస్ ( US Secret Service )తీరుపై రిపబ్లికన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ట్రంప్‌ భద్రత విషయంలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శిస్తున్నారు.దీంతో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటిల్ తన పదవికి రాజీనామా చేశారు.

అయితే సీక్రెట్ సర్వీస్ అధికారులు మాత్రం.స్థానిక పోలీసులను తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ( Wall Street Journal )ప్రచురించిన ఫుటేజ్‌ వైరల్ అవుతోంది.

ట్యూషన్లు చెబుతూ ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి.. ఎంతో గ్రేట్ అంటూ?
ఒలంపిక్ గోల్డ్ మెడల్‌ని కుక్కకు అంకితం చేసిన డచ్ స్విమ్మర్.. ఎందుకో తెలిస్తే..

నిందితుడు థామస్ క్రూక్స్( Thomas Crooks ) కాల్పులు జరపడానికి ముందే సమీపంలోని భవనాలపై భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా సీక్రెట్ సర్వీస్‌ను కోరాల్సిందిగా ఓ పోలీస్ అధికారి తన సహచరుడితో చెప్పిన మాటలు అతని బాడీ కామ్‌లో రికార్డ్ అయ్యాయి.తుపాకీ శబ్ధం వచ్చిన వెంటనే తాను ఇక్కడ ఓ వ్యక్తిని ఉంచమన్నానంటూ ఆ అధికారి చెబుతున్న వాయిస్ ఫుటేజ్‌లో వినిపించింది.

Advertisement

మరోవైపు.జాయింట్ కాంగ్రెషనల్ విచారణ సందర్భంగా యూఎస్ సీక్రెట్ సర్వీస్ తాత్కాలిక డైరెక్టర్ రోనాల్డ్ రోవ్ మాట్లాడుతూ.ట్రంప్‌పై హత్యాయత్నం సమయంలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలపై తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా, సీక్రెట్ సర్వీస్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా నాటి ఘటనలో పైకప్పుపై సరైన భద్రత ఎందుకు కల్పించలేదో తెలియడం లేదన్నారు.

తాజా వార్తలు