Animal Movie: ఆ చెత్త సీన్ వల్లే యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందట.. ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నటించిన తాజాగా చిత్రం యానిమల్.

( Animal Movie ) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాలో రష్మిక మందన( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమా విడుదలైన మొదట్లో సినిమాపై అనేక రకాల విమర్శలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

ఇందులో ఎక్కువ హింస ఉందని, మహిళల పై అఘాయిత్యాలు చుపించారంటూ కొంతమంది విమర్శలు చేశారు.కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీ విజయం సొంతం చేసుకుంది.

అంతే కాదు కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది.

Advertisement

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా 500 కోట్లకు చేరువవుతోంది.వరల్డ్ వైడ్ గా ఏకంగా 1000 కోట్లకు పరుగులు పెడుతోంది యానిమల్ మూవీ.ఇది ఇలా ఉంది తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమాలో బాబీ డియోల్( Bobby Deol ) క్యారెక్టర్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశాడు.ఈ సినిమాలో బాబీ డియోల్ నటించిన ఓ సన్నివేశం పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

ఒక అత్యాచారానికి సంబంధించిన సన్నివేశం అది.తాజాగా ఆ సన్నివేశం పై బాబీ డియోల్ మాట్లాడుతూ.ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అన్నాడు బాబీ.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

యానిమల్ సినిమాలో బాబీ డియోల్ తన పెళ్లి వేదిక పై పెళ్లి కూతురిని రేప్ చేసే సీన్ చూపించారు.ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా బలవంతగా అనుభవించడానికి రమ్మనడం చూపించారు.దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.

Advertisement

ఈ విషయం పై బాబీ స్పందిస్తూ.ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు.

ఇలాంటివాటిని నేను కూడా ప్రోత్సహించను.కానీ సినిమా విలన్ క్యారెక్టరైజేషన్ చెప్పడానికి ఉన్న తక్కువ సమయంలో అలాంటి సీన్ ఉపయోగపడింది అని అన్నారు.

తాజా వార్తలు