Telangana BJP : బీజేపీ తెలంగాణ రెండో జాబితా విడుదల..!!

దేశవ్యాప్తంగా మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ వారం లేదా వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

దీంతో 2024 ఎన్నికలలో అధికారం ఎవరు కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ( BJP ) ప్రభుత్వం స్థాపించింది.

మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని కాషాయ పెద్దలు కంకణం కట్టుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది.

ఏపీలో ఒకేసారి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

Advertisement

ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు( Parliament Elections ) తెలంగాణ ప్రధాన పార్టీలు సిద్ధం అవుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికలలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు.

ఇదే సమయంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా.ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నికలకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్ట్ లో 9 మంది పేర్లను వెల్లడించడం జరిగింది.

తాజాగా బుదవారం బీజేపీ రెండో జాబితా విడుదల చేయడం జరిగింది.

బీజేపీ తెలంగాణ రెండో జాబితా:

ఆదిలాబాద్ - గోడం నగేశ్, పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్ , మెదక్ - రఘునందన్ రావు, మహబూబ్నగర్ - డీకే అరుణ నల్గొండ - సైదిరెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయక్ , దీంతో బీజేపీ మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించింది.వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

వైరల్: భవనం నుంచి అమాంతం దూకేసిన మార్జాలము... ట్విస్ట్ ఇదే!
Advertisement

తాజా వార్తలు