స్లో అండ్ స్టడీ గా బిజెపి సెకండ్ లిస్టు?

తెలంగాణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party ) స్లో అండ్ స్టడీ మోడ్ లో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది.

ముఖ్యంగా గత ఉప ఎన్నికల్లోను జిహెచ్ఎంసి ఎన్నికల లోనూ చెప్పుకోదగ్గ ప్రభావం చూపించినప్పటికీ అసెంబ్లీ పోటీకి వచ్చినప్పడు మాత్రం ఆ పార్టీ కొంత విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది.

ముఖ్యంగా పార్టీకి కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలలో మాత్రమే సీట్ల కోసం పోటీ ఉంది తప్ప నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పోటీకి ఆ పార్టీకి చెప్పుకోదగ్గ అభ్యర్థులు లేరు.అందుకోసమే అధికార బారాస మరియు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ల నుంచి వలస వచ్చే నేతల కోసం ఆ పార్టీ వేచిచూచే దొరణి అవలంబిస్తుంది.

కాంగ్రెస్( Congress ) రెండవ లిస్టు బయటకు వస్తే టికెట్టు దక్కని కొంతమంది నేతలకు భాజపా చివరి ఆప్షన్ అవుతుందని అప్పుడు ఆయా అభ్యర్థులలో గెలుపు గుర్రాలను ఒడిసి పట్టుకోవాలనే వ్యూహాన్ని బిజెపి( BJP ) అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది.అంతేకాకుండా ప్రభావం చూపగల ఎంపీలను అసెంబ్లీకి పోటీ చేయించాలన్న వ్యూహాన్ని దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న బిజెపికి తెలంగాణలో మాత్రం అందుకు అవకాశం లేనట్లుగా తెలుస్తుంది.

Bjp Second List As Slow And Study , Pawan Kalyan, Rajagopal Reddy , G Vivek, Ko

ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేతలైన జి వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కీలక నేతలు అసెంబ్లీ బరిలో నిలవడానికి అంత ఆసక్తిగా లేరని వార్తలు వస్తున్నాయి.రాజగోపాల్ రెడ్డి ( Rajagopal Reddy )కొంత అనుకూలంగా ఉన్నా మిగిలిన నేతలు మాత్రం అసెంబ్లీ బరిలో దిగడానికి అంత ఇష్టం చూపించడం లేదని తెలుస్తుంది.దాంతో ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతల కోసం నవంబర్ 1 తరువాత అభ్యర్థులను ఫైనల్ చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Bjp Second List As Slow And Study , Pawan Kalyan, Rajagopal Reddy , G Vivek, Ko
Advertisement
BJP Second List As Slow And Study , Pawan Kalyan, Rajagopal Reddy , G Vivek, Ko

అంతేకాకుండా జనసేనతో పొత్తు సమీకరణాలను కూడా బిజెపి అధిష్టానం పరిశీలిస్తున్నందున త్వరలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో అమిత్ షా భేటీ జరగనుందని ఈ భేటీ తర్వాత ఉమ్మడి పోటీపై మరింత స్పష్టత వస్తుందని తద్వారా జనసేనకు ఇవ్వాల్సిన సీట్లను కూడా ఫైనల్ చేసుకొని చివరి లిస్టు విడుదల చేయాలని భాజపా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఏది ఏమైనా తెలంగాణ ఎన్నికలలో కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయినా కావాలని భావిస్తున్న బిజెపి కీలకమైన స్థానాలను గెలుచుకునే దిశగా వ్యూహాలను అమలు చేస్తుంది.దానికి జనసేన లాంటి మిత్రపక్షం తోడైతే అనుకూల ఫలితాలు రాబట్టువచ్చన్నది ఆ పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు