మద్దతు ఇస్తే సరే లేదంటే ..? జగన్ పై బీజేపీ సంచలన నిర్ణయం  ?

జగన్ కు రానున్నది కష్టకాలం గానే కనిపిస్తోంది.ముఖ్యంగా బీజేపీ విషయంలో ఆయన అటో ఇటో ఎటో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతున్న సంకేతాలు వస్తున్నాయి.

ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.సొంతంగా బలం పెంచుకుని అధికారం దక్కించుకోవాలని కలలు కంటోంది.

ఈ కల ఇప్పటిది కాదు.ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న,  బీజేపీ సక్సెస్ కాలేకపోతోంది.

అసలు ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులు కూడా లేని పరిస్థితి ఉండడంతో, బీజేపీ ఆశ తీరడం లేదు.అలాగే బీజేపీ పై ఆసక్తి లేకపోవడం, ప్రాంతీయ పార్టీల వైపు జనాలు చూస్తూ ఉండడం, ఎలా ఎన్నో కారణాలతో బీజేపీ ఆశ అడియస గా ఉంది.

Advertisement

అందుకే ఎప్పటికప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం , లేక పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తూ వస్తున్నాయి.ఇక ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో టిడిపి వైసిపి లకు ధీటుగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దించింది.

జనసేన సహకారంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం తో తప్పకుండా గెలుస్తాము అని మొదట్లో బీజేపీ నేతలో ధీమా కనిపించింది.అయితే వాస్తవ పరిస్థితి తెలిసిన తర్వాత , వైసీపీకి విజయం దక్కినా, కనీసం రెండు లక్షల ఓటింగ్ బీజేపీ వైపు ఉంటే, తమ ఆశ తీరుతుంది అని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

అదే 50 వేలకు తక్కువగా ఓటింగ్ నమోదు అయితే ఏపీలో బీజేపీ బలపడటం  అసాధ్యం అనే అభిప్రాయానికి ఆ పార్టీ పెద్దలు వచ్చేశారు.అందుకే ఇప్పటి నుంచే జగన్ పై దృష్టి పెట్టినట్లు గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం టిడిపి బలహీనంగా ఉండడం,  రాబోయే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉండడంతో,  జగన్ పై దృష్టి పెట్టారు .

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ ను ఎన్డీయే లో చేరవలసిందిగా బీజేపీ ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అలా చేరితే కేంద్రంలో రెండు కీలకమైన మంత్రి పదవులు వైసీపీకి కట్టబెట్టి,  రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము చూసుకుంటామని భరోసా ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సిద్ధం అయ్యారట.ఒకవేళ జగన్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే, రాబోయే రోజుల్లో జగన్ పై ఒత్తిడి పెంచడమే కాకుండా ఆయన పై పెండింగ్ లో ఉన్న కేసుల విషయంలో మరింత ఇబ్బంది పెట్టి తమ పంతం నెరవేర్చుకోవాలనే అభిప్రాయంలో బిజెపి పెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

ఎలా చూసుకున్నా తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం జగన్ ఇబ్బందికర పరిస్థితి బీజేపీ నుంచి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు