టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర.. ఒప్పందం కుదర్చుకున్నారంటూ ప్రచారం

తెలంగాణ బీజేపీ సరికొత్త రాజకీయ వ్యూహాలతో పెద్ద ఎత్తున ముందుకు సాగుతోంది.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమకు అన్ని అవకాశాలను వందకు వంద శాతం వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ మాత్రం బీజేపీ ప్రస్తుతం పరిణామాల పట్ల పెద్దగా స్పందించడం లేదు.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బీజేపీ పై జరుగుతున్న ఓ సరికొత్త ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనే విషయాన్ని ప్రక్కకు పెడితే ఇక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు చేరేలా బీజేపీ ఒప్పందం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది అయితే టీఆర్ఎస్ మాత్రం ఈ ప్రచారంపై పెద్దగా స్పందించని పరిస్థితి ఉంది.

ఒకవేళ బీజేపీ మాత్రం ఇలా చేస్తే కనుక తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ సంచలనం జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఎందుకంటే బీజేపీ చేస్తున్న అతిపెద్ద రిస్క్ ఇదేనని మనం చెప్పవచ్చు, ఇక అదే జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కంటే సంవత్సరం ముందుగానే కూలిపోయే అవకాశం ఉంది.అయితే ఈ ప్రచారంపై బీజేపీనేతలు కూడా స్పందించలేదు.

Advertisement

అయితే ఈటెల రాజేందర్ మొత్తం వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఈటెలకు చాలా సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు సంప్రదింపులు సాగిస్తున్నట్టు సమాచారం.

ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకపోతే బీజేపీ గెలుపు చాలా కష్టం.ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేనటువంటి పరిస్థితి ఉంది.

అంతేకాక బలమైన అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది.అయితే ఈ ప్రచారం ప్రచారంలా మాత్రమే ఉండనుందా లేదా నిజం కానుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు