బండికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన బిజెపి శ్రేణులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బండ లింగంపల్లి, కోరుట్ల పేట,సింగారం, గ్రామాలలో కార్యకర్తలు బండి సంజయ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్దాల గ్యారెంటీ ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

బిఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని గ్రామాలలో ప్రజలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వైపు ఉన్నారని,ప్రజల నుండి అద్భుతంగా స్పందన వస్తుందన్నారు.మరోసారి నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రిగా చూడాలని గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

బండి సంజయ్ కుమార్ కి మీ మద్దతు తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రాజి రెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, కమ్మరి ఆంజనేయులు,బాల గౌడ్, కిరణ్ నాయక్, చందుపట్ల లక్ష్మారెడ్డి, గణేష్,శ్రీశైలం, బంధారపు లక్ష్మారెడ్డి,నేవూరి దేవేందర్ రెడ్డి,సంజీవరెడ్డి, కృష్ణ హరి, బొమ్మడి స్వామి, వంగల రాజు, సత్యం రెడ్డి, బాపురెడ్డి, బోడావత్ రవి, ధరావత్ రవి, సాగర్, శ్రీకాంత్, ప్రకాష్,వేణు, దయాకర్,హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు వివిధ మోర్చా ల అధ్యక్షులు పాల్గొన్నారు.

డే కేర్ సెంటర్ లో ఘనంగా ఐటి శాఖ మంత్రి పుట్టిన రోజు వేడుకలు
Advertisement

Latest Rajanna Sircilla News