లాలూ సిక్కులకు క్షమాపణ చెప్పాలా?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిక్కులను అవమానించారా? అవును అవమానించారు అంటున్నారు భాజపా నాయకుడు సుషీల్ మోడీ.

సిక్కులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నాయకులు ఏదో ఒక మాటను పట్టుకొని దానికి ఈకలు పీకి వివాదాలు లేవదీస్తుంటారు.ఏదో ఒక వర్గానికి అన్యాయం జరిగిందని, వారికి బాధ కలిగించారని గొడవ చేస్తుంటారు.

సాధారణంగా మాట్లాడిన మాటలకు కూడా యేవో అర్థాలు తీస్తుంటారు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు లాలూ కొన్నాళ్ళు జైల్లో గడిపారు.అప్పుడు ఆయన జైలును సిక్కుల దేవాలయమైన గురుద్వారాతో పోల్చారట.

జైలు అంటే గురుద్వారా వంటిదని (పవిత్రమైనదని) కాబట్టి కాబట్టి జీవితంలో ఒక్కసారి అయినా జైలుకు రాకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదని అన్నారట.ఈ కామెంట్లను ఇప్పుడు గుర్తు చేసిన సుషీల్ మోడీ లాలూ సిక్కులను అవమానించారని అన్నారు.

Advertisement

లాలూ ముస్లీముల ప్రార్థనా మందిరాలైన మసీదులను కూడా అవమానిస్తారని అన్నారు.ఆయనకు అంతటి ధైర్యం ఉందన్నారు.

ఈ ఆరోపణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే సిక్కులు, ముస్లీములు లాలూ ఉన్న గ్రాండ్ అలయన్స్ కు ఓట్లు వేయొద్దని చెప్పడమే.ఎన్నికల్లో ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం సాధారణమే.

Advertisement

తాజా వార్తలు