విమాన ప్రయాణంలో నటికి చేదు అనుభవం.. ఎయిర్ లైన్స్ పై ఫైర్ అవుతున్న నటి?

మోడల్ గా,నటిగా ఎన్నో హిందీ సినిమాలలోనూ అలాగే హిందీ సీరియల్స్ లోను నటించి మెప్పించిన నటి నిమ్రత్ కౌర్ ప్రస్తుతం పలు హిందీ సీరియల్స్ తో పాటు అమెరికాలో ప్రసారమయ్యే టెలివిజన్ కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు తాజాగా విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురయింది.

ఈమె అమెరికాకు సంబంధించిన ఎయిర్ లైన్స్ లోప్రయాణం చేస్తుండగా ఆమె లగేజ్ మిస్ అయిందని అలాగే మరొక లగేజ్ బ్యాగ్ పూర్తిగా డామేజ్ అయిందని వెల్లడించారు.ఈ క్రమంలోనే నిమ్రత్ కౌర్ అమెరికా ఎయిర్లైన్స్ సంస్థ డెల్టా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం విమానయాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన లగేజ్ మిస్ అవ్వడమే కాకుండా తన లగేజ్ బ్యాగ్ పూర్తిగా డామేజ్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మిస్ అయిన తన బ్యాగ్ వెతికి పెట్టాలంటూ డిమాండ్ చేశారు.తన లగేజ్ బ్యాగ్ మిస్ కావడంతో తాను కొన్ని గంటలపాటు ఎంతో శారీరక మానసిక క్షోభ అనుభవించానని ఈ సందర్భంగా నటి పేర్కొన్నారు.

Bitter Experience Of Actress In Air Travel Actress Getting Fired On Airlines ,fi

ఈ విధంగా విమాన ప్రయాణంలో తన లగేజ్ బ్యాగ్ మిస్ అవ్వడమే కాకుండా మరొక బ్యాగ్ పూర్తిగా అవడంతో ఈమె ఆగ్రహం వ్యక్తం చేయగా వెంటనే ఈ విషయంపై స్పందించిన డెల్టా ఆమె ఫిర్యాదును అంగీకరించి ఈ విషయంపై సరైన చర్యలు తీసుకుంటామని అయితే కొంత సమయమనం పాటించాలని నటి నిమ్రత్ కౌర్ ను డెల్టా ఎయిర్ లైన్స్ సంస్థ కోరింది.ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement
Bitter Experience Of Actress In Air Travel Actress Getting Fired On Airlines ,fi
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తాజా వార్తలు