పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో భారీగా బైక్ ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాలో భాగంగా జిల్లా పోలీస్,17th బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,17th బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ రావు.

శుక్రవారం రోజున సిరిసిల్ల పట్టణంలో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ,అంబేద్కర్, కొత్త బస్టాండ్, నేతన్న చౌరస్తా నుండి గాంధీ చౌక్ మీదుగా ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు ఉత్సాహంగా సాగిన బైక్ ర్యాలీ.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని, ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని,అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ వారి మన్నలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామని,పోలీస్ అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనదారులు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటించాలని,వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల వాళ్ళ జరిగే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్యత గుర్తించాల్సిన అవసరం ఉందని,రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన వాహనదారులు మరణించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనం నడపాలని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, సి.ఐ లు శ్రీనివాస్, మధుకర్, ఎస్.ఐ లు 17th బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Advertisement

Latest Rajanna Sircilla News