బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్లు ఫిక్స్ అయ్యారా.. ఈ కంటెస్టెంట్లకే ఛాన్స్ ఇస్తారా?

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ షో( Bigg Boss Show ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈ షో తెలుగు తమిళం,హిందీ, కన్నడ, మలయాళం అని భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల భాషల్లో సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతూ దూసుకుపోతోంది.

ఇప్పటికీ కొన్ని భాషల్లో పదుల సంఖ్యలో సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో.తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.గత సీజన్ కామన్ మ్యాన్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ ఏడాది బిగ్ బాస్ 8( Bigg Boss 8 ) ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.తరచూ ఈ షో కి సంబంధించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.తాజాగా కూడా ఈ షోపేరు గట్టిగానే వినిపిస్తోంది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈసారి కూడా నాగార్జుననే( Nagarjuna ) హోస్టుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.ఒక వైపు షో రెడీ అవుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో చాలామంది బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నారంటూ రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ పై యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చేసింది అంటున్నారు.

అందులో పాపులర్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి,( Venuswamy ) ఫుడ్ తో తెగ ఫేమస్ అయిన కుమారి ఆంటీ( Kumari Aunty ) పేర్లు మార్మోగిపోతున్నాయి.అలాగే జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్ కిర్రాక్ ఆర్పీ,( Kiraak RP ) బర్రెలక్క,( Barrelakka ) టీవీ ఆర్టిస్టులు తేజస్విని, అక్షిత, హారిక, సాయికిరణ్ ఇంకొంతమంది యుట్యూబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే లిస్ట్ లో ఉన్నట్లుగా టాక్.మరి వీరిలో ఎంత మంది హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి మరి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు