అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. సిక్కు కమ్యూనిటీ మద్ధతు ఎవరికీ..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరింది.ఇప్పటికే డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్ధులు అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల( Donald Trump ) మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది.

 Who Getting Support Of Sikhs In Us Presidential Election 2024 Details, Sikhs ,u-TeluguStop.com

త్వరలోనే ఇరు పార్టీలు వీరిద్దరికి అధికారికంగా అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయనున్నాయి.ఎన్నికల నేపథ్యంలో అమెరికాలో( America ) స్థిరపడిన పలు సమూహాలు, జాతులను ఆకట్టుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ప్రభావవంతమైన సిక్కులు( Sikhs ) ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా నిలిచింది.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.ఈ క్రమంలో ‘‘సిఖ్ అమెరికన్స్ ఫర్ ట్రంప్ ’’( Sikh Americans for Trump ) అధినేత జస్దీప్ సింగ్( Jasdip Singh ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, చట్టబద్ధంగా జరిగే దానిపై ట్రంప్ విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.వచ్చే వారం మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ (ఆర్ఎన్‌సీ)కి ముందు జాతీయ వార్తాసంస్థ పీటీఐతో జస్దీప్ మాట్లాడుతూ.

తమ కమ్యూనిటీ మద్ధతు ట్రంప్‌కు ఉందని భావిస్తున్నానని చెప్పారు.ట్రంప్ కోసం నిధులు సేకరిస్తున్నామని.త్వరలో సమావేశానికి వెళ్తున్నామని జస్దీప్ తెలిపారు.

Telugu Donald Trump, Jasdip Singh, Jassee, Joe Biden, Sikhamericans, Sikhs, Pres

మిల్వాకీలో నాలుగు రోజుల పాటు జరిగే ఆర్ఎన్‌సీ కన్వెన్షన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ ప్రతినిధులు నవంబర్ 5న జరిగే సాధారణ ఎన్నికలకు తమ అధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేస్తారు.ఈ సందర్భంగా ట్రంప్ ఫైనాన్స్ కమిటీలో నియమితులైన జెస్సీ ( Jassee ) అనే వ్యక్తి మాట్లాడుతూ.ట్రంప్‌కు మద్ధతుగా న్యూయార్క్‌లోని వెస్ట్‌కోస్ట్, టెక్సాస్ నుంచి తమ బృందాన్ని సమీకరిస్తామన్నారు.

Telugu Donald Trump, Jasdip Singh, Jassee, Joe Biden, Sikhamericans, Sikhs, Pres

అధ్యక్షుడు జో బైడెన్ గత నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై మనందరికీ తెలుసునని జెస్సీ చెప్పారు.కానీ అమెరికన్ ప్రజలకు ఈ విషయాలు తెలియకుండా మీడియా దానిని నియంత్రించిందని ఆయన ఆరోపించారు.ప్రెసిడెన్షియల్ డిబేట్( Presidential Debate ) అనంతరం ట్రంప్ ప్రజాదరణలో మార్పులు చోటు చేసుకున్నాయని జెస్సీ చెప్పారు.ద్రవ్యోల్బణం, అక్రమ వలసలు, మౌలిక సదుపాయాలు, హింస, నేరాలతో అమెరికా సతమతమవుతోందన్నారు.

ఈ క్రమంలోనే తాను ట్రంప్‌కు మద్ధతు ఇస్తున్నానని జెస్సీ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube