బిగ్ బాస్ షో కు సమంత పారితోషికం ఎంతంటే..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో దసరా పండుగ రోజున సమంత సందడి చేయనున్నారు.

మామ నాగార్జున మనాలీలో షూటింగ్ తో బిజీగా ఉండటంతో కోడలు పిల్ల సమంత షోను హోస్ట్ చేయనున్నారు.

కెరీర్ మొదటి నుంచి సినిమాలకే పరిమితమైన సమంత ఇలా ఒక షోకు హోస్ట్ గా కనిపించడం ఇదే తొలిసారి.ఇప్పటికే స్టార్ మా ఛానెల్ సమంతకు సంబంధించిన ప్రోమోలను విడుదల చేసింది.

రంగస్థలం లోని పాటతో ఎంట్రీ ఇచ్చిన సామ్ ప్రోమోతోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.ఈరోజు టెలీకాస్ట్ కాబోయే ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

వెండితెరపై హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్న సామ్ బిగ్ బాస్ షో హోస్టింగ్ తో బుల్లితెరపై కూడా తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టనున్నారు.అయితే బిగ్ బాస్ షోకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది.? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.సాధారణంగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లు రెండు రోజులు ఉంటాయి.

Advertisement

అయితే నిన్నటి ఎపిసోడ్ హోస్ట్ లేకుండానే ప్రసారమైంది.ఈరోజు మాత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు బిగ్ బాస్ షో ప్రసారం కానుంది.

దాదాపు మూడు గంటల షో కావడంతో నాగార్జున రెండు ఎపిసోడ్లకు తీసుకునే మొత్తాన్ని సమంతకు చెల్లించనున్నారని సమాచారం.పారితోషికం విషయంలో సమంత కూడా పెద్దగా పట్టింపులకు పోదు.

మరోవైపు బిగ్ బాస్ షోకు వీకెండ్ స్థాయిలో వీక్ డేస్ ఎపిసోడ్లపై ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు.మరి సమంత హోస్టింగ్ తో బిగ్ బాస్ రేటింగ్స్ పుంజుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి దివి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ వల్ల ఈ విషయం తెలిసింది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు