భార్యపై అలాంటి కామెంట్ చేసిన కౌశల్.. కంటతడి పెట్టేలా..?

బుల్లితెరపై చాలా షోలకు యాంకర్ గా చేసి గుర్తింపును సంపాదించుకున్న కౌశల్ మండా బిగ్ బాస్ షో సీజన్ 2 ద్వారా ప్రేక్షకుల్లో పాపులారిటీని పెంచుకున్నారు.

బిగ్ బాస్ షో సీజన్ 2కు కౌశల్ విన్నర్ గా నిలవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నారు.

ప్రజలకు మేలు చేసే పనులు చేయడం ద్వారా కూడా కౌశల్ వార్తల్లో నిలిచారు.సీజన్ 2 సమయంలో పలు వివాదాల ద్వారా కూడా కౌశల్ పేరు మారుమ్రోగింది.

అయితే కౌశల్ ఆర్మీలో ఉన్న కొంతమంది కౌశల్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బుల విషయంలో ఆరోపణలు చేశారు.కౌశల్ భార్య నీలిమపై ఆరోపణలు వ్యక్తం కాగా ఆ సమయంలో కౌశల్ మండా నీలిమ ఆరోగ్యం గురించి ప్రస్తావించారు.

తన భార్య ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుందని కౌశల్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.అయితే తాజాగా కౌశల్ భార్య గురించి షాకింగ్ కామెంట్లు చేస్తూ పోస్ట్ పెట్టారు.

Advertisement

అసలేం జరిగిందో స్పష్టంగా వెల్లడించకుండా కౌశల్ నువ్వు ఏదో సాధించాలని వెళ్లావని.నువ్వు నీ జీవితంతో ఏదో ఒకటి చేయడానికి పోరాడుతున్నావని.నీకు ధైర్యం ఉందని అన్నారు.

నువ్వు త్వరగా కోలుకుని కలలతో పోరాడవని ఆశిస్తున్నానని కౌశల్ తన పోస్ట్ లో వెల్లడించారు.లవ్ యూ మిస్ యూ అంటూ కౌశల్ పోస్ట్ పెట్టడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.

వదినకు ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ పోస్టులు పెడుతున్నారు.కౌశల్ అభిమానులు కంటితడి పెట్టేలా పోస్ట్ చేయడంతో ఏదో జరిగిందని భావిస్తున్నారు.

అయితే కౌశల్ పూర్తిస్థాయిలో స్పందించి చెబితే మాత్రమే అసలేం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది.కౌశల్ క్లారిటీ ఇవ్వకపోవడంతో కౌశల్ భార్యకు ఏం జరిగిందో అభిమానులకు అర్థం కావడం లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు