బిగ్ బాస్ 7 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. బయటపడిన అసలు విషయం?

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రియాలిటీ షో లలో బిగ్ బాస్( Bigg Boss )రియాలిటీ షో ఒకటి.

ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇక తెలుగులో అయితే ఇప్పటికే ఆరు సీజన్లోని పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఏడవ సీజన్ అవుతుంది.

ఈ సీజన్లో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు.మొత్తం 14 మందితో ఎంతో ఘనంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ గా 11 మంది హౌస్ లో ఉన్నారు.

ఇకపోతే తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) వ్యాఖ్యతగా వ్యవహరించారు.ఇక రెండవ సీజన్ కు నాని(Nani ) వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అప్పటినుంచి ఇప్పటివరకు నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు.

అయితే నాగార్జున ( Nagarjuna )పట్ల ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఈ విమర్శలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇలా మూడవ సీజన్ నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున ఈ షో కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న విషయాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి.

Advertisement

ఇకపోతే తాజాగా మరోసారి ఈ కార్యక్రమం కోసం నాగార్జున తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ షో కోసం నాగార్జున ఈ సీజన్ మొత్తానికి కలిపి సుమారు 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ( Remuneration ) అందుకుంటున్నారని తెలుస్తోంది.ఇక నాగార్జున సినిమా చేసిన ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేరు.

అందుకే ఈయన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది.ఇలా నాగార్జున సీజన్ సెవెన్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..
Advertisement

తాజా వార్తలు