ట్రంప్ పై దర్యాప్తుకు ఆదేశించిన బిడెన్..నేరం రుజువైతే...

అమెరికా అధ్యక్షుడు బిడెన్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా, భారీ మెజారిటీతో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డెమోక్రటిక్ పార్టీని ఇబ్బంది పెట్టాలని తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ట్రంప్ కు చెక్ పెట్టాలని యోచిస్తున్నారా అందుకు అనుగుణంగానే తాజా సంఘటనలు జరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.

ఇప్పటికే బిడెన్ ట్రంప్ తన పరిపాలన సమయంలో తీసుకున్న ఒక్కో నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ షాక్ ఇస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా ట్రంప్ పై ఓ కీలక అంశంపై దర్యాప్తుకు ఆదేశించింది.

బిడెన్ ఇప్పటికే అమెరికా సరిహద్దు గోడ విషయంలో అలాగే ట్రంప్ బ్యాన్ చేసిన యాప్స్ , వలసలు కారణంగా పిల్లలను తల్లి తండ్రుల నుంచీ దూరం చేసిన సంఘటనలలో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన విషయం విధితమే అయితే ట్రంప్ అధికారంలో ఉండగా కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని అందుకు సమగ్ర దార్యప్టు చేపట్టాలని అమెరికా న్యాయ విభాగం ఆదేశించింది.ట్రంప్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్ధులపై నిఘా పెట్టారని వారికి శిక్షలు విధించడానికి కూడా ఆయన వెనుకాడలేదని అంతేకాకుండా.

అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా సహకారం కూడా పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి.అలాగే డెమోక్రటిక్ పార్టీ కి చెందిన కీలక నేతలైన ఎరిక్ , ఆడం ఫిష్ ల ఐ ఫోన్ లను ట్యాప్ చేసి సమాచారం తీసుకున్నారని ఇందుకోసం న్యాయవిభాగం అధికారులతో పాటు ఆపిల్ కంపెనీ కూడా ట్రంప్ కు సహకరించాయని వీరిద్దరూ కాకుండా మరో 10 మందికి పైగా డెమోక్రటిక్ పార్టీ నాయకుల ఫోన్ డేటా కూడా ఆపిల్ కంపెనీ ట్రంప్ కు అందించిందని విమర్శలు కొన్ని ఆధారాలతో సహా వెలువడటంతో ట్రంప్ పై దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం.ఈ ఆరోపణలు అన్నీ ఆధారాలతో సహా రుజువైతే ట్రంప్ కు భారీ స్థాయిలో శిక్ష పడటం ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ విషయంలో బిడెన్ చాలా సీరియస్ గా ఉన్నాయని త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

Advertisement
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

తాజా వార్తలు