Venky kudumula nithin : మళ్ళీ రాబోతున్న భీష్మ కాంబో.. ఈసారి కూడా హిట్ అందుకుంటుందా?

వెంకీ కుడుముల.ఈయన చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.వెంకీ కుడుములకు ఇది మొదటి సినిమా.

అంతేకాదు ఈ సినిమాతోనే రష్మిక మందన్న తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా వల్ల వెంకీ కుడుముల టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆ తర్వాత భీష్మ సినిమా చేసాడు.ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా అటు నితిన్ కెరీర్ కు ఇటు వెంకీ కెరీర్ కు ప్లస్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల ఇంత వరకు మరొక సినిమాను మొదలు పెట్టలేదు.ఇప్పటికే చాలా మంది హీరోలు పేర్లు వినిపించిన ఒక్కరితో కూడా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో వెంకీ సినిమా చేయబోతున్నాడు అని టాక్ అయితే వచ్చింది.కానీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇక తాజా ఈయన లైనప్ గురించి మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

వెంకీ కుడుముల మరోసారి నితిన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసారని.ఆ కథ నితిన్ కు కూడా బాగా నచ్చిందని.

Advertisement

అంత కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించ బోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించ బోతున్నారని టాక్.

చూడాలి మరి ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందో లేదో.

తాజా వార్తలు