నాలుగో రోజు భీమ్లా నాయక్ కలెక్షన్లు అంత తక్కువా.. ఆ ఎఫెక్ట్ పడిందంటూ?

ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో భారీ అంచనాలతో విడుదలై క్రిటిక్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి, సాధారణ ప్రజల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా అంటే భీమ్లా నాయక్ సినిమా మాత్రమేనని చెప్పాలి.ఫస్ట్ వీకెండ్ రికార్డు స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా సోమవారం కలెక్షన్లు పరవాలేదనేలా ఉన్నాయి.

నాలుగో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.శని, ఆదివారం కలెక్షన్లతో పోల్చి చూస్తే కలెక్షన్ల విషయంలో డ్రాప్ కనిపించింది.110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా సాధించాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ సినిమాకు 71 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.మరోవైపు ఈ సినిమాలో అంత ఇష్టం ఏందయ్యా సాంగ్ లేదని పవన్ అభిమానులు తెగ ఫీలవుతున్నారు.

సోషల్ మీడియాలో అయినా ఈ సాంగ్ ను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

అయితే దర్శకుడు సాగర్ కె చంద్ర మాత్రం ఆ సాంగ్ ను షూట్ చేయలేదని షూట్ చేయని సాంగ్ ను ఎలా అప్ లోడ్ చేయగలమని చెబుతున్నారు.నాలుగో రోజు కలెక్షన్లలో డ్రాప్ కనిపించినా ఈరోజు సెలవు కావడంతో భీమ్లా నాయక్ ప్రదర్శిస్తున్న పలు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఈరోజు కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫైనల్ రేంజ్ ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

అయితే పవన్ కెరీర్ లో తొలి 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.అయితే ఈ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత తగ్గించడంతో నిత్యామీనన్ హర్ట్ అయ్యారని సమాచారం.

Advertisement

ఈ రీజన్ వల్లే నిత్యామీనన్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement
" autoplay>

తాజా వార్తలు