' భట్టి ' ఆకస్మిక ఢిల్లీ టూర్ ? పిలిచారా ఫిర్యాదు కోసమా ? 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు.

అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు రావడంతోనే ఇంత హడావుడిగా ఢిల్లీకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం బట్టి విక్రమార్క చివరి వరకు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు.అయితే రేవంత్ వైపు అధిష్టానం మొగ్గు చూపించడంతో బట్టి సైలెంట్ అయిపోయారు.

అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం బట్టి వద్ద అసంతృప్తి వ్యక్తం చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి.  తెలంగాణ పిసిసి కాస్తా తెలుగుదేశం పార్టీ పిసిసి గా మారుతోంది అంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు విమర్శలు చేశారు.

అయినా ఆయన మాత్రం ఈ విషయంలో ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గానే ఉన్నారు.అయితే కొద్ది రోజుల క్రితం తెలంగాణలో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ వ్యవహారం పై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

ఆ తరువాత స్వయంగా సీఎం కేసీఆర్ బట్టి విక్రమార్క కు ఫోన్ చేయడం , కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ తో భేటీ అవ్వడం, భట్టి డిమాండ్లపై కేసీఆర్ స్పందించడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి.అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు ఎవరు అనుమతి లేకుండా కేసీఆర్ ను కలవడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

భట్టి విక్రమార్క త్వరలోనే టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అని పెద్దఎత్తున ప్రచారం మొదలైంది. 

ఆకస్మాత్తుగా భట్టి కి అధిష్టానం పెద్దలు నుంచి పిలుపు రావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తనకు పిసిసి అధ్యక్ష పదవి దక్కకపోవడం తదితర కారణాలపై  విక్రమార్క అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారా లేక కేసీఆర్ ను కలవడం పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పీలిచారా అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.ఏది ఏమైనా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసిన తర్వాత ఈ విషయంలో స్పష్టమైన  క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు