అమెరికా వాసులకు ప్రభుత్వం హెచ్చరిక...బయటకు రావద్దంటున్న నేషనల్ వెదర్ సర్వీస్...!!!

అమెరికాపై ప్రకృతి పగ బట్టిందా అన్నట్టుగా ఉంది తాజా పరిస్థితి చూస్తుంటే.

ఒక పక్క కరోనా, మరో పక్క తుఫాను, వరదలతో గడిచిన కొంత కాలంగా ఎన్నో ఇబ్బందులు పడిన అమెరికా ప్రజలు తాజాగా ప్రభుత్వ హెచ్చరికలతో తలలు పట్టుకుంటున్నారు.

అసలు తాము అమెరికాలో ఉంటున్నామా లేక ఎడారి ప్రాంతం లో ఉన్నామా అంటూ ఆందోళన చెందుతున్నారు.అమెరికాలో అసలేం జరుగుతోందో తెలియడం లేదంటూ గొల్లు మంటున్నారు.

ఇంతకీ అంతగా ప్రజలు ఆందోళన చెందటానికి కారణం ఏంటంటే.గడిచిన కొన్ని రోజులుగా అమెరికాలో ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

అమెరికాలో ఈ స్థాయిలో ఎండలు మండిపోవడం తాము ఎప్పుడూ చూడలేదంటూ అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాము ఇళ్ళలో ఏసి లు వేసుకుంటున్నా చల్లబడటం లేదని, ఎండ వేడికి తట్టుకోలేక బోరు మంటున్నారు.

Advertisement

పోర్ట్ ల్యాండ్ , ఒరెగాన్, సలేం సియాటిల్ నగరాలలో ఎండలు మండిపోతున్నాయని రోజుకు 44 నుంచీ 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ఇది ప్రమాదకరమైన విషయంగా పరిగణించాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలోనే వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్స్లీ మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్నా మార్పుల వలన సహజ సిద్దంగా ఋతువులు రావడంలేదని అందుకే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని, ముందు ముందు ఎండలు ఎక్కువయ్యే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అంతేకాదు ప్రజలు ఎవరూ బయటకు తిరగవద్దని ఏసీ గదులు విడిచి బయటకు కూడా రావద్దని సూచిస్తున్నారు.ఇదిలాఉంటే ఎండలకు తట్టుకోలేక కొందరు మరణించిన క్రమంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్ స్పందించారు.

గ్లోబల్ వార్మింగ్ కు, ప్రస్తుతం ఉన్న ఎండలకు ఎలాంటి సంభంధం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అయితే వాతావరణంలో వస్తున్నా మార్పులకు గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద సమస్యని నిపుణులు అంటుంటే అధ్యక్షుడు బిడెన్ అదేం కాదని చెప్పడం విమర్సలకు దారి తీస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు