మెరుగైన వైద్య సేవలు అందించాలి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి కలెక్టర్ గురువారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు.ఆసుపత్రికి సాధారణ పేషెంట్లు, గర్భిణులు రోజూ ఎందరు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

కొత్తగా స్టాఫ్ నర్సులు వచ్చినందున వారిని మెటర్నిటీ వార్డులో ఎక్కువ మంది సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు.ఔట్ పేషెంట్ రిసెప్షన్ కౌంటర్ ను కార్పోరేట్ స్థాయిలో కనిపించేలా తీర్చదిద్ధాలన్నారు.

అనంతరం రోగులకు అందించే మందులు నిల్వ చేసే గదులు పరిశీలించారు.మందుల వివరాలు కంప్యూటర్లో చూశారు.

Advertisement

మందులు అందించే కౌంటర్ ను పరిశీలించిన కలెక్టర్, ప్రస్తుతం ఉన్న కౌంటర్ పక్కన మరొక కౌంటర్ ను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.ఫార్మసీ గదిలో మరిన్ని సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు.

అక్కడి నుంచి గర్భిణులకు పరీక్షలు చేసే గదిని పరిశీలించి, రోజూ ఎందరికి సేవలు అందిస్తున్నారు? ఎన్ని నెలలకు పరీక్షలు చేస్తారని ప్రశ్నించారు.గర్భిణీ స్త్రీలు వెయిటింగ్ చేసేందుకు నూతనంగా 40 సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన హాల్ ను కలెక్టర్ పరిశీలించారు.

టిఫ్ఫా స్కానింగ్ లు ఎక్కువ చేయాలని, అవసరమైతే కొత్తగా రేడియాలజిస్ట్ ను నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.బాలింతల వార్డ్ పరిశీలించి, అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు.

అనంతరం టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయా? లేదా? పరిశీలించారు.దవాఖానా ఆవరణలో రక్త నిర్ధారణ పరీక్షల రిపోర్టులు జారీ చేసేందుకు నూతనంగా నిర్మించిన గదిని పరిశీలించారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తదనంతరం చిన్న పిల్లల వార్డ్ లు సందర్శించి, వారికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.ఎస్ఎన్సీయూ వార్డ్ ను సందర్శించారు.

Advertisement

మొత్తం ఎందరు డాక్టర్ లు ఉన్నారు? ఎంత మంది పిల్లలకు వైద్యం అందుతుందో అడిగి తెలుసుకున్నారు.దవాఖానకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.

ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్శనలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డా.సంతోష్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, మున్సిపల్ ఈఈ ప్రసాద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News