వేస‌వి వేడి వ‌ల్ల పొడి బారిన‌ చ‌ర్మాన్ని రిపేర్ చేసే బెస్ట్ రెమెడీ ఇదే!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

అయితే వేస‌వి వేడి కార‌ణంగా కొంద‌రి చ‌ర్మం పొడి బారిపోతుంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఖ‌రీదైన మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు యూజ్ చేస్తుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే వేస‌వి వేడి వ‌ల్ల పొడి బారిన‌ చ‌ర్మాన్ని సుల‌భంగా రిపేర్ చేసుకోవ‌చ్చు.

మ‌రి ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.

Advertisement

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు ఎండ‌బెట్టుకున్న క‌మ‌లా తొక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ పెస‌ర ప‌ప్పు, రెండు టేబుల్ స్పూన్ల చంద‌నం పొడి, కొన్ని ఎండ‌బెట్టిన‌ గులాబీ రేకులు, మ‌రికొన్ని ఎండ‌బెట్టిన‌ చామంతి రేకులు, ప‌చ్చి ప‌సుపు కొమ్ము చిన్న‌ది, వ‌న్ టేబుల్ స్పూన్ వ‌ట్టి వేరు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని బౌల్‌లోకి తీసుకుని.అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం,

వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖంతో పాటు శ‌రీరం మొత్తానికి ప‌ట్టించి ఐదు నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకుని.

సోప్‌ను వాడ‌కుండా స్నానం చేసేయాలి.ఆపై మీ స్కిన్‌కు సూట్ అయ్యే మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఇలా వారంలో మూడు సార్లు చేస్తే గ‌నుక పొడి బారిన చ‌ర్మం మ‌ళ్లీ మృదువుగా, తేమ‌గా మారుతుంది.అలాగే స‌న్ ట్యాన్ స‌మ‌స్య దూరం అవుతుంది.

Advertisement

మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్నా తొల‌గిపోయి స్కిన్ క్లియ‌ర్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

తాజా వార్తలు