పైసా ఖ‌ర్చు లేకుండా వైట్ హెయిర్‌ను నివారించే బెస్ట్ రెమెడీ ఇదే!

వైట్ హెయిర్‌.స్త్రీ, పురుషుల‌ను మాన‌సికంగా కృంగ‌ దీసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

వ‌య‌సు పైబ‌డ‌టం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, ఒత్తిడి, హెయిర్ స్టైలింగ్ ప్రోడెక్ట్స్‌ను ఓవ‌ర్‌గా యూజ్ చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు తెలుపు రంగులోకి మారి పోతుంటుంది.దాంతో చూసేందుకు ముస‌లి వారిలా క‌నిపిస్తారు.

ఈ నేప‌థ్యంలోనే వైట్ హెయిర్‌ను దాచేసేందుకు క‌ల‌ర్స్‌ను వాడుతుంటారు.అయితే ప్ర‌తి నెలా క‌ల‌ర్స్‌ను కొనుగోలు చేయాలంటే వేల‌కు వేలు ఖ‌ర్చు అవుతుంటాయి.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ రెమెడీని పాటిస్తే పైసా ఖ‌ర్చు లేకుండా వైట్ హెయిర్‌ను బ్లాక్‌గా మార్చుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా రెండు బంగాళ‌ దుంప‌ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి తొక్క‌ల‌ను మాత్రం వేరుచేసుకోవాలి.

Advertisement
Best Home Remedy For White Hair! Home Remedy, White Hair, Black Hair, Hair Care,

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే.అందులో బంగాళ‌దుంప తొక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల ఇన్‌ స్టంట్ కాఫీ పౌడ‌ర్ వేసి బాగా ఉడికించాలి.

నీరు స‌గం అయ్యాక‌.స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌ బెట్టుకోవాలి.

ఇప్పుడు వాట‌ర్‌తో స‌హా బంగాళ‌దుంప తొక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేయాలి.

Best Home Remedy For White Hair Home Remedy, White Hair, Black Hair, Hair Care,

చివ‌రిగా ఈ పేస్ట్‌లో ఒక పూర్తి ఎగ్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి మిక్స్ చేసుకోవాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ఈ మిశ్ర‌మాన్ని ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసు కోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే గ‌నుక తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుతుంది.

Advertisement

మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం త‌గ్గుతుంది.

తాజా వార్తలు