పురుషులు వారంలో 2 సార్లు ఈ నూనెను రాస్తే జుట్టు రాలే సమస్య జీవితంలో ఉండదు!

హెయిర్ ఫాల్‌.స్త్రీలే కాదు పురుషులు సైతం ఈ స‌మ‌స్య‌తో తీవ్రంగా స‌త‌మ‌తం అయిపోతుంటారు.

అందులోనూ పెళ్లి కాని అబ్బాయిల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, ఒత్తిడి, కాలుష్యం, జుట్టు విష‌యంలో స‌రైన కేర్ తీసుకోక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్డ్స్‌ను వాడ‌టం.

వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు విప‌రీతంగా రాలిపోతుంటుంది.ఈ క్ర‌మంలోనే కొంద‌రు పురుషులు హెయిర్ ఫాల్‌కి ఎలా చెక్ పెట్టాలో తెలీక మాన‌సిక కృంగుబాటుకు గుర‌వుతారు.

ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే ఇక‌పై చింతించకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఆయిల్‌ను వారంలో రెండంటే రెండు సార్లు త‌ల‌కు ప‌ట్టిస్తే జుట్టు రాలే స‌మ‌స్య జీవితంలో ఉండ‌దు.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ సూప‌ర్ ఆయిల్ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? చూసేయండి.

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు లేదా ఆరు స్పూన్ల మెంతుల‌ను వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రెండు క‌ప్పుల‌ ఆవ నూనె, మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న మెంతి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ ఆయిల్‌ను డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో ఐదు నిమిషాల పాటు బాగా హీట్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ ఆయిల్‌ను ఫిల్ట‌ర్ చేసి.ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి.

ఇక హెయిర్ ఫాల్‌తో ఇబ్బంది ప‌డుతున్న పురుషులు ఈ ఆయిల్‌ను నైట్ నిద్రించే ముందు త‌ల‌కు ప‌ట్టించి కాసేపు మ‌సాజ్ చేసుకుని ప‌డుకోవాలి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూతో త‌ల స్నానం చేయాలి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాల‌డం క్ర‌మంగా త‌గ్గి.ఒత్తుగా, న‌ల్ల‌గా పెర‌గ‌డం ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు