దేవరకొండ మండల వాసికి బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు...?

దేవరకొండ మండలం కొమ్మపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారు తిరుపతిలో జరిగిన సౌత్ ఇండియా రైటర్స్ ఆరవ కాన్ఫరెన్స్ సమావేశంలో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డును ప్రకటించారు.

ఈ అవార్డును బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు.

కొమ్మపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి నిరంజన్ నారమ్మ దంపతుల జేష్ఠ పుత్రుడు డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.ఇతనికి భార్య రేవతి, విశిష్ట,శ్రేష్ఠ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీనివాస్ గౌడ్ బాల్య దశ నుంచే విద్యార్థి ఉద్యమ నాయకుడుగా పనిచేశాడు.బాల్యం,ప్రాథమిక చదువు సొంత గ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ పడమటిపల్లిలో, ఇంటర్మీడియట్,డిగ్రీ దేవరకొండ కళాశాలలో, రసాయన శాస్త్రంలో పోస్టు గ్రాడియేషన్ కాకతీయ యూనివర్సిటీలో పూర్తిచేసి ప్రభుత్వ,ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలల్లో జిల్లాలో 14 సంవత్సరాలుగా పని చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్ గా,పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా,ప్రజా నౌకయుద్ధ గద్దర్ తో తెలంగాణ ధూంధాం, సామాజిక జాతరతో భారీ ఎత్తున 30వేల మందితో ఉద్యమం నడిపిన నాయకుడు.ఇవేగాక బిసి, బహుజన ఉద్యమాలలో, ప్రజాసేవ కార్యక్రమాలలో నేనున్నానని ధర్నాలు,రిలే దీక్షలు,రాస్తారోకోలు,ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలకు సేవనందించి ప్రజల మన్ననలు పొందినారు.

Advertisement

కల్లు వృత్తిదారుల సమస్యలపై డిండి నుంచి మాల్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సమస్యల సాధనకై కృషి చేశారు.గురుకుల పాఠశాల,కళాశాలలో అనేకమంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత సీట్లు ఇప్పించి వారి మన్ననలు పొందారు.

అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు.ఇతని సేవలు గుర్తించి ఈ అవార్డును ప్రకటించారు.

ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన,చేయడానికి సహకరించిన సెలక్షన్ కమిటీ సభ్యులకు,అవార్డు అందించిన వారికి అవార్డు గ్రహీత డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.ఇదే స్ఫూర్తితో ప్రజల మన్ననలు పొందుతూ సేవ చేయడానికి మరింత ముందుండి అనేక ఉద్యమాలలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తానని చెప్పారు.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

Latest Suryapet News