పీసీఓడీతో బాధ‌ప‌డుతున్నారా? అయితే వీటిని ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోండి!

పీసీఓడీ అంటే పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌.ఇటీవల రోజుల్లో మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఇది.

హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ రుగ్మత ఎదురవుతుంది.దీని కారణంగా మహిళలు గర్భం దాల్చడం కష్టమవుతుంది.

అలాగే శరీర బరువును అదుపు తప్పడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, నెలసరి సమయంలో అధికంగా లేదా తక్కువగా రక్తస్రావం కావడం, మొటిమలు, హెయిర్ ఫాల్, తీవ్రమైన ఒత్తిడి, ర‌క్త‌హీన‌త‌ తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని నివారించుకుని పీసీఓడీ నుంచి బయట పడాలంటే ఖచ్చితంగా డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలను చేయించుకోవాల్సి ఉంటుంది.

మరి ఆ ఫుడ్స్ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.కొబ్బరి నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు.అయితే పీసీఓడీ బాధితులకు కొబ్బరి నూనె వరమనే చెప్పవచ్చు.

Advertisement

రోజు పరగడుపున వ‌న్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ను తీసుకుంటే అందులో ఉండే ప్రత్యేక సుగుణాలు పీసీఓడీ మరియు పీసీఓడీ లక్షణాలను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

అలాగే పీసీఓడీ తో బాధపడేవారు ఖచ్చితంగా తమ డైట్ లో న‌ట్స్ అండ్ సీడ్స్ ను చేర్చుకోవాలి.ముఖ్యంగా బాదం, పిస్తా, వాల్ నట్స్, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వంటి వాటిని నీటిలో నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ సమయంలో తీసుకోవాలి.ఇవి హార్మోనల్ బ్యాలెన్స్ కు గ్రేట్ గా సహాయపడతాయి.

తద్వారా పీసీఓడీ క్రమంగా కంట్రోల్ అవుతుంది.

దానిమ్మ పీసీఓడీ బాధితులకు చాలా మేలు చేస్తుంది.రోజుకొక దానిమ్మ పండును తీసుకుంటే ఒత్తిడి, రక్తహీనత, మొటిమలు, హెయిర్ ఫాల్ తదితర పీసీఓడీ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇక సీజనల్‌గా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, అల్లం, పసుపు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పాలస్తీనా అనుకూల నిరసనలు : కొలంబియా వర్సిటీలో పోలీస్ అధికారి కాల్పులు .. వివాదం

ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేసి పీసీఓడి నుంచి త్వరగా బయటపడడానికి సూప‌ర్‌గా సహాయపడతాయి.

Advertisement

తాజా వార్తలు