నీటిలో తాబేలు ఎందుకు ఉంచాలి? అలా ఉంచడం వల్ల లాభమేంటి?

ఇక డబ్బు నిల్వ ఉండడం కోసం ఇంటిలో ఉంచాల్సిన మరో పరికరం తాబేలు.

ఒక ప్లేటులో నీటిని పోసి అందులో తాబేలు ప్రతిమను కనుక ఉంచితే చాలా మంచిదట.

ఇలా ఉంచడం వలన మన ఇంటిలోని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని మరియు ఇంటిల్లి పాదీ సుఖసంతోషాలతో జీవిస్తారని అనేక మంది నమ్ముతారు.ఇక ఇలా ఇంటిలో ప్లేటుని ఉంచి నీటిని పోసి  తాబేలును ఉంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

BENEFITS OF E KEEPING TORTOISE IDOL IN WATER AT HOME , Devotional, Gods, Telugu

ఈ తాబేలు ప్రతిమ ఉత్తరం వైపు చూసేలా మనం దానిని ప్రతిష్టించాలి.ఎలాగూ తాబేలు ప్రతిమ ఉంచితే మంచి జరుగుతుంది కదా అని కొంత మంది వ్యక్తులు ఇంట్లో రెండు మూడు తాబేలు ప్రతిమలను ఉంచుతారు.

కానీ ఇలా చేయడం  మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు.కావున ఇంటిలో ఒకే ఒక తాబేలు ప్రతిమ ఉండాలని చెబుతున్నారు.

Advertisement

ఇలా మాత్రమే కాకుండా మూడు కాయిన్లను ఎరుపురంగు క్లాత్ లో కట్టి ఉంచితే కూడా శుభాలు కలుగుతాయని చెబుతారు.ఇలా చేయడం వలన ధన ప్రవాహం వస్తుందని అనేక మంది నమ్ముతారు.

ఇలా కాయిన్లను కట్టి పర్సులో కానీ లేదా ఇంటి మెయిన్ డోర్ కు కట్టి కానీ వేలాడదీయాలి.అలాగే ఇంటిలోని మహిళలు తమ అరచేతి అచ్చులను ఇంటి గేటుకు లేదా ఇంటి గోడకు అచ్చు వేయాలి.

పసుపు వారి చేతులకు రాసుకుని ఆ తర్వాత ముద్రలు వేయాలి.ఇలా చేయడం వలన ఇంటిలోకి నెగటివ్ ఎనర్జీ రాదని అనేక మంది విశ్వసిస్తారు.

ఇలా చేసిన ఆ ఇల్లు ముక్కోటి దేవతలకు నచ్చుతుందని భావిస్తారు.

చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు