ఈ వీడియో చూస్తే భారతీయులుగా సిగ్గుపడతారు!

భారతీయ ప్రయాణికుల( Indian Passengers ) విమాన ప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది.

కంటెంట్ క్రియేటర్ అంకిత్ కుమార్( Ankit Kumar ) షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

థాయ్ ఎయిర్ఏషియా విమానంలో( Thai Airasia Flight ) ప్రయాణికులు విమానం గాల్లో ఉండగానే హడావుడి చేశారు.కొందరు నిలబడి గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ, మరికొందరు ఏకంగా తింటూ కనిపించారు.

విమాన సిబ్బంది ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు.ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

అంకిత్ కుమార్ అయితే మరింత ఘాటుగా స్పందించారు."భారతీయులు ప్రతిచోటా ఇలాగే ప్రవర్తిస్తారు.

Advertisement

విమానాన్ని బస్సు స్టాండ్ లా మార్చేశారు.ఇది విమానమా లేక సంతనా?" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

అంకిత్ కుమార్ షేర్ చేసిన వీడియోని ఇప్పటికే 16 లక్షల మందికి పైగా చూడగా, 26 వేల మందికి పైగా లైక్ చేశారు.కామెంట్ల విభాగంలో చాలా మంది ప్రయాణికుల ప్రవర్తనను( Passengers Behavior ) తప్పుబడుతున్నారు."డబ్బుంటే మర్యాద రాదు" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, "ఇతరులతో ఎలా మెలగాలో భారతీయులు నేర్చుకోవాలి.

నేను కూడా భారతీయుడినే, కానీ ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు" అని మరొకరు రాశారు.

చాలా మంది తమ నిరాశను వ్యక్తం చేస్తూ, "భారతదేశంలో చాలా మందికి కనీస మర్యాదలు లేవు.భారతీయులుగా మనం సిగ్గు పడాల్సిన పరిస్థితి వస్తోంది." అని అన్నారు.

కాలు కడుక్కోవడానికి వెళ్తే.. మొసలి కడుపులోకి.. ఇండోనేషియాలో భయానక ఘటన!
మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ.. ఎవరీ కైట్లిన్ సాండ్రా?

ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ, "నేను ఒక క్రూయిజ్ షిప్‌లో పనిచేశాను, నా సహోద్యోగులు భారతీయ అతిథుల ప్రవర్తన గురించి తరచుగా ఫిర్యాదు చేసేవారు" అని తెలిపారు.అంటే, విమానాల్లోనే కాదు, ఇతర ప్రయాణ సాధనాల్లో కూడా కొందరు భారతీయుల ప్రవర్తన ఇలాగే ఉంటోందని తెలుస్తోంది.

Advertisement

ఇది ఒకే ఒక్క సంఘటన కాదు.పోలాండ్‌కు చెందిన ఒక NRI మ్యూనిచ్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో భారతీయ ప్రయాణికులు ఇలాగే ప్రవర్తించారని రాశారు.

వారు చాలా గట్టిగా మాట్లాడటం, దురుసుగా ప్రవర్తించడం, ఇతరులను పట్టించుకోకపోవడం వంటివి చేశారని ఆయన ఆరోపించారు.

తాజా వార్తలు