సైకో వీరంగం... అకారణంగా బిచ్చగాడి హత్య

ఈ మధ్య కాలంలో సొసైటీలో సైకోలు ఎక్కువైపోతున్నారు.మానవ మృగాలుగా మారి సమాజం మీద పడి విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.

తాజాగా హైదరాబాద్ లో దారుణం జరిగింది.నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ఓ ఉన్మాది పట్టపగలే విచ్చలవిడిగా రెచ్చిపోయాడు.

అకారణంగా ఓ బిచ్చగాడిని హత్య చేశాడు.అది కూడా తన పాటికి బిక్షాటన చేసుకుంటున్న అతని మీద దాడి చేసి విచక్షణా రహితంగా హత్య చేసి చంపేసాడు.

సైదాబాద్‌ ప్రాంతంలోని దోబీఘాట్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది.ఓ సైకో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వస్తుండగా, అక్కడే సిగల్స్‌ వద్ద భిక్షాటన చేస్తున్న వ్యక్తి కనిపించాడు.

Advertisement

వెంటనే ఆ బిచ్చగాడి మెడకు గుడ్డ చుట్టి గట్టిగా బిగించి చంపేశాడు.అయితే ఆ క్షణంలో రోడ్డు మీద ఉన్న ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు తప్ప అతనిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

దగ్గరకి వెళ్తే ఎక్కడ తమ మీద దాడి చేస్తాడో అని భయపడి ఎవరు దగ్గరకి వెళ్ళలేదు.ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు
Advertisement

తాజా వార్తలు