Beer Hops Alzheimers: అల్జీమర్స్ వ్యాధికి, బీర్‌కు లింక్ వుందంటున్న లేటెస్ట్‌ రీసెర్చ్‌... అందులో ఏముందంటే?

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి.ఈ విషయం మేం చెప్పట్లేదు, అల్జీమర్స్ వ్యాధికి, బీర్‌కు లింక్ ఉందని ఓ లేటెస్ట్‌ రీసెర్చ్‌ చెప్పింది.

ఇక ప్రపంచంలో ఎంతో మంది వృద్ధులు అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే.ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇది ఘోరమైన మతిమరుపునకు కారణం అవుతుంది.నిపుణులు సైతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని చెప్పడం కొసమెరుపు.

ఈ కారణంగా వ్యాధి లక్షణాలను గుర్తించేసరికే బాధితుల నాడీ వ్యవస్థ కోలుకోలేని స్థాయిలో దెబ్బతింటోంది అని ఓ సర్వే.అందుకే ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించే నివారించే ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

Advertisement

అల్జీమర్స్‌ను ప్రారంభ దశల్లో గుర్తించే పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ ఇమేజింగ్‌ టెక్నిక్‌ను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేసి రికార్డు క్రియేట్ చేశారు.అయితే బీర్‌ తయారీలో ఉపయోగించే హాప్‌ పూల ద్వారా అల్జీమర్స్‌ రాకుండా నివారించే అవకాశం ఉందని మరో అధ్యయనం చెప్పడం కొసమెరుపు.

హాప్ పువ్వుల నుంచి సేకరించిన రసాయనాలు, అల్జీమర్స్ వ్యాధి (AD)తో సంబంధం ఉన్న అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ల సమూహాన్ని నిరోధించగలవు.

పాన్-యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసాయి.కాగా ఈ పరిశోధన వివరాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో తాజాగా ప్రచురించ బడ్డాయి.అల్జీమర్స్‌ లక్షణాలను ముందే గుర్తించడంలో ఇబ్బందుల కారణంగా, దీనికి చికిత్స కష్టం అవుతోంది.

ఈ కోవలోనే ముందుగా ఈ లక్షణాలను గుర్తించే దిశగా పరిశోధనలు జరుపుతున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు