Tollywood Heroines: తక్కువ టైం లోనే ఫేమ్ తెచ్చుకున్న భామలు వీరే.. కానీ..

సినీ ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం.ఇందులోకి ఇక్కసారి ఇరుక్కుంటే అంత త్వరగా బయటకు రాలేము.

అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పుకోవాలి.వీరి కెరీర్ టైం అంత లాంగ్ గా ఉండదు.

హీరోయిన్లు కొంత కాలానికే కెరీర్ ముగించాల్సిందే.హీరోలు ముసలివారు అవుతున్న లాంగ్ రన్ కొనసాగిస్తారు.

కానీ హీరోయిన్స్ అలా కాదు.వారి కెరీర్ 10 ఏళ్ల లోపే ముగిసి పోతుంది.

Advertisement

అయితే కొంత మంది హీరోయిన్స్ మాత్రం కెరీర్ ఫెడవుట్ అవుతున్న ఇంకా అవకాశాలు అందుకుంటూనే ఉంటారు.ఇలాంటి హీరోయిన్స్ కూడా టాలీవుడ్ లో ఉన్నారు.

ఇక కొంత మంది మాత్రం కెరీర్ లో ఎంత ఫాస్ట్ గా హిట్స్ అందుకుని అవకాశాలు దక్కించు కుంటున్నారో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అవుతున్నారు.ఈ మధ్య కాలంలో త్వరగా పాపులర్ అయ్యి ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని మళ్ళీ త్వరగా ఫేడ్ అవుట్ అవుతున్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.

ఉప్పెన వంటి సూపర్ హిట్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీ కృతి శెట్టి.ఈమె ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి ఫేమ్ తెచ్చుకుంది.అయితే ఈమె వరుస అవకాశాలు అందుకుంటుంది కానీ ఫేమ్ ను మాత్రం కోల్పోయింది.

ఈ బాటలోనే డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఉంది.ఈమె ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాగే ఉండిపోయింది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న నభా నటేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.ఇలా ఒక్క సినిమాతోనే షార్ట్ టైం లోనే ఫేమస్ అయ్యి మళ్ళీ ఆ ఫేమ్ ను నిలబెట్టుకోలేక నానా పాట్లు పడుతున్నారు.

Advertisement

కానీ పదేళ్ల క్రితం వచ్చిన హీరోయిన్స్ మాత్రం ఇప్పటికి ఇండస్ట్రీలో హవా చూపిస్తున్నారు.

తాజా వార్తలు