జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.2019 ఎన్నికల తర్వాత జనసేన పని అయిపోయిందని అంతా అంచనా వేసినా. ఈ మధ్యకాలంలో అనుభవంగా పార్టీని బలోపేతం చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు.ముఖ్యంగా వైసిపి ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజలు జనసేన వైపు ఉండేలా తగిన రాజకీయ వ్యూహానికి పవన్ తెర తీశారు.
ఈ విషయంలో వైసిపి కాస్త కలవరం చెందుతోంది.ఇటీవల విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం పై పవన్ విరుచుకుపడ్డారు.వైసీపీని ఎలాగైనా ఓడిస్తామంటూ సవాల్ చేశారు.ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు జనసేన పై విమర్శలు చేశారు.
పవన్ వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు.అయితే దీనికి వైసిపి నుంచి గట్టిగానే కౌంటర్ లు పడ్డాయి. తాజాగా జనసేన విషయంలో ఏం చేయాలనే విషయంపై వైసీపీ కాపు సామాజిక వర్గం కు చెందిన ఎమ్మెల్యేలు రాజమండ్రిలో సమావేశం అయ్యారు.అంతకుముందే వైసీపీకి చెందిన బీసీ సామాజిక వర్గం కు చెందిన నాయకులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
అయితే కాపు సామాజిక వర్గం ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంలో జనసేనకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరిగింది.ఏపీలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపు సామాజిక వర్గానికి జగన్ ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారని, ప్రభుత్వ పథకాలతో తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేశారని, మంత్రివర్గంలోనూ తగిన ప్రాధాన్యం ఇచ్చారని ఈ సమావేశంలో చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ సరికొత్తగా ఇరుకును పెట్టేందుకు వైసిపి ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తాము సంతోషిస్తామంటూ ప్రకటించారు.కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోవడం లేదని… మరొక నేతను ముఖ్యమంత్రి చేసేందుకు ఆరాటపడుతున్నారని వైసిపి కాపు ఎమ్మెల్యేలు విమర్శించారు.కాపుల ఓట్లను గంప గుత్తగా చంద్రబాబుకు అమ్మేసేందుకు పవన్ సిద్ధమయ్యారంటూ వారు విమర్శలు చేశారు .ఇప్పుడు ఇదే అభిప్రాయం జనాల్లోనూ కలిగేలా చేసేందుకు వైసిపి కాపు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు.టిడిపి, జనసేన ఏపీలో పొత్తు పెట్టుకోవడం ఖాయమనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.
అందుకే టిడిపి అధినేత చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో చీలిక తెచ్చి మెజారిటీ ఓటర్లు వారికి వ్యతిరేకంగా మారే విధంగా వైసిపి వ్యూహం సిద్ధం చేస్తోంది.వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తోంది.
ఏదో రకంగా జనసేన కు కాపుల మద్దతు దూరం చేసే విధంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు.