తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ: ఎంపిడివో ఇందిరా

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని ( Bathukamma festival), మోటకొండూరు ఎంపిడివో ఇందిరా(MPDO Indira) అన్నారు.

సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఇందిర మాట్లాడుతూ అన్ని దేవతలను పూలతో కొలుస్తుండగా,తీరొక్క పూలతో బతుకమ్మలను కొలచే అత్యంత విశిష్టమైన పండుగని అన్నారు.ప్రతి సంవత్సరం ఆడబిడ్డలు అంతా ఒక్క దగ్గర ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగను రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారన్నారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ యశోద,ఎపిఓ అరుణ కుమారి,టిఎలు స్వామి, చంద్రమోహన్,మంగ,సిఓ లు అలువేలుమంగ,సిద్ది మల్లేశ్,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమ నల్లగొండ జిల్లాలో పాట్లేమో సూర్యాపేట జిల్లా ప్రజలకు...!
Advertisement

Latest Yadadri Bhuvanagiri News