బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..?

టాలీవుడ్‌లో కమెడియన్ స్థాయి నుండి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు.

వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తూ, తనదైన మార్క్‌ను వేసుకునే బండ్ల గణేష్, గతంలో రాజకీయాల్లోకి ప్రవేశించి అట్టర్ ఫ్లాప్ కావడంతో అందులో నుండి బయటకు వచ్చేశాడు.

ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పగానే మళ్లీ సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తూ వస్తున్నాడు.గతంలో ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ చేసిన కొన్ని కామెంట్స్‌కు ఆయనకు ‘బ్లేడ్ స్టార్’ అనే బిరుదును కేటాయించేశారు తెలుగు జనం.కాగా ఇప్పుడు బండ్ల గణేష్‌కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.తాజాగా బండ్ల గణేష్‌కు అనారోగ్యంగా ఉండటంతో ఆయన్ను ఓ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ వార్త ఒక్కసారిగా బయటకు పొక్కడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.నిజంగానే బండ్లకు కరోనా పాజిటివ్ వచ్చిందా అంటూ జనం ఆరా తీస్తున్నారు.ఏదేమైనా ఈ వార్తపై క్లారిటీ రావాలంటే బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు స్పందిచే వరకు ఆగాల్సిందే.

కాగా బండ్ల గణేష్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుతున్నారు.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Advertisement

కాగా రీసెంట్‌గా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ కమెడియన్‌గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు