పవన్‌తో 100 కోట్ల మూవీకి ప్లాన్‌ చేస్తున్న బండ్లబాబు... వర్కౌట్‌ అయ్యేనా?

ఎన్నికల్లో దారుణ పరాభవంను చవి చూసిన పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోనే కొనసాగుతాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

అయితే రాజకీయాల్లో చాలా నీతిగా ఉండేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నాడు.

అందుకే పవన్‌ కళ్యాణ్‌కు ఆర్థికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.జనసేన పార్టీని రాబోయే అయిదు సంవత్సరాల్లో నడిపించాలంటే పవన్‌ వద్ద కనీసం 100 కోట్లు అయినా ఉండాలని, అప్పుడే ఆయన రాజకీయాలు చేయగలడు అంటూ పార్టీ వర్గాల వారు మరియు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అంత డబ్బు రావాలంటే పవన్‌ ముందు ఉన్న ఒకే ఒక్క మార్గం సినిమాలు.అందుకే ఆయన మళ్లీ సినిమాలు చేస్తాడని తెలుస్తోంది.

ఈ సమయంలోనే పవన్‌కు ఆప్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్‌ గురించిన ఒక వార్త పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ను బండ్ల గణేష్‌ కలిశాడని, పవన్‌ కళ్యాణ్‌ డేట్ల కోసం కోరినట్లుగా తెలుస్తోంది.అదే సమయంలో పవన్‌కు ఏకంగా 40 కోట్ల పారితోషికంను ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

ప్రముఖ దర్శకుడితో కథను కూడా సిద్దం చేయిస్తున్నాడట.హీరో మరియు దర్శకుడికి 50 కోట్లు కాగా ఇతర బడ్జెట్‌ మరో 50 కోట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్న బండ్ల గణేష్‌ 100 కోట్ల సినిమా ఎలా తీస్తాడు చెవిలో పూలు ఏమైనా పెడుతున్నారా అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.అయితే పవన్‌ కళ్యాణ్‌ డేట్లు లభించాలే కాని ఆర్థికపరమైన సమస్యలు పెద్ద సమస్యలే కాదు అంటూ బండ్ల గణేష్‌ అభిప్రాయమట.పవన్‌ డేట్లు ఇవ్వడమే ఆలస్యం నేనంటే నేను చాలా మంది ఫైనాన్స్‌ చేసేందుకు ముందుకు వస్తారనేది బండ్ల బాబు ఆలోచనట.

మరి పవన్‌ ఈయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేనా, ఈ ప్రయత్నం వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.

ఆ పార్టీ ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు : సుహాస్
Advertisement

తాజా వార్తలు