Balakrishna Unstoppable : స్టార్ హీరో బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోయిందా.. ఇదే ప్రూఫ్ అని చెబుతూ?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) మొట్టమొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్.

ఈ షో చేయకముందు వరకు కేవలం హీరోగా అలరించిన బాలకృష్ణ ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ తనలో ఉన్న మరొక కోణాన్ని కూడా బయట పెట్టారు.

ఇకపోతే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.అయితే ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్‌ షో మూడో సీజన్‌కి సన్నద్ధమవుతోంది.

అయితే సీజన్‌ 3 ప్రారంభం కాకముందే భగవంత్‌ కేసరి, యానిమల్‌ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఆ సినిమాలకు స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహించారు బాలకృష్ణ.

మూడో సీజన్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది, అందులో గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారు, వంటి ఆసక్తికరమైన అంశాల గురించి మీడియాలో, సోషల్‌ మీడియాలో( Social media ) విపరీతమైన చర్చలు కొనసాగుతున్నాయి.అయితే త్వరలోనే సీజన్‌ 3ని( Unstoppable 3 ) ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారని అందరూ భావించారు.కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే.

Advertisement

అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో ఆగిపోయిందా? అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.అలా రావడం వెనుక కారణం కూడా లేకపోలేదు.

అన్‌స్టాపబుల్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలోని ఒక ఫ్లోర్‌లో సెట్‌ వేశారు.

అయితే హఠాత్తుగా ఈ సెట్‌ను అక్కడి నుంచి తొలగించారు.దీంతో ఈ షో ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.అన్‌స్టాపబుల్‌ ( Unstoppable)అంటే ఎవ్వరూ ఆపలేనిది అని అర్థం.

కానీ, షో మాత్రం ఆగిపోయింది అంటూ రకరకాల కామెంట్స్‌ వినిపస్తున్నాయి.బాలకృష్ణ వరసగా సూపర్‌ హిట్‌ సినిమాలు చేస్తూ ఎంతో ఊపు మీద ఉన్నారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఎంతో ఉత్సాహంగా కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఒకదాని వెంట మరొకటి అన్నట్టుగా వరసగా సినిమాలు చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు