Balayya Varalakshmi : వరలక్ష్మి పనికి షాక్ అయిన బాలయ్య.. జయమ్మ మజాకా.. అసలేమైందంటే?

వరలక్ష్మి శరత్ కుమార్ అంటే టక్కున గుర్తు రాకపోయినా జయమ్మ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకొస్తారు.

సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ సినిమాలలో నటించారు.

అయితే తెలుగులో ఈమె క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు.క్రాక్ సినిమాలో ఈమె పాత్రకు మంచి మార్కులు పడటంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇక అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో కూడా లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన పాత్రలో నటించారు.ఇక ప్రస్తుతం ఈమె సమంత నటించిన యశోద సినిమాతో పాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నటువంటి వీర సింహారెడ్డి సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఈమె పాత చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.తాజాగా ఈ సినిమాలో జయమ్మ పాత్ర గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Balayya Is Shocked By Varalakshmis Work Jayamma Is Funny What Happened, Balayya,

ఇందులో బాలకృష్ణకు వరలక్ష్మికి మధ్య జరిగే సన్నివేశం చిత్రీకరణలో భాగంగా ఏకంగా ఐదు పేజీల డైలాగును చెప్పాల్సి వచ్చిందట.

Balayya Is Shocked By Varalakshmis Work Jayamma Is Funny What Happened, Balayya,

ఈ విధంగా ఈమె బాలకృష్ణ ఎదుట ఒకేసారి ఐదు పేజీల డైలాగ్ చెబుతూ సింగిల్ టేక్ లో షాట్ కంప్లీట్ చేసిందని తెలుస్తుంది.ఇలా ఈమె సింగిల్ టేక్ లోఐదు పేజీల డైలాగ్ చెప్పడంతో బాలకృష్ణతో పాటు అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తోంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో కూడా వరలక్ష్మి పాత్ర హైలెట్ అవునుందని సమాచారం.ఇక ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు