ఒంటికి పట్టిన దెయ్యాని వదిలించే గుడి.. ఎక్కడుందో తెలుసా..

గుడికి వెళ్తే.మనకు ప్రశాంతంగా ఉంటుంది.

మనసు ఆందోళనగా ఉన్నా.

మనం మందిరానికి వెళ్తాం.

కానీ రాజస్థాన్ డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి వెళ్తే మాత్రం విపరీతమైన అరుపులు వినిపిస్తాయి.గుడి ఆవరణలో దెయ్యాలు, దుష్ట శక్తులు పీడిస్తున్న బాధితులు కనిపిస్తారు.

ఈ ఆలయం ఒంట్లో దెయ్యాన్ని వదిలించే గుడిగా చాలా ఫేమస్.ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు.

Advertisement

అక్కడ ఉన్న దేవుడు.బాలాజీకి దెయ్యాలను వదిలించే శక్తి ఉందని భక్తులు నమ్ముతారు.

అలా అని బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి అని అనుకుంటారేమో.అక్కడ బాలాజీ అంటే హనుమంతుడు.

ఇక్కడ హనుమంతుడి విగ్రహం.పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టు ఉంటుంది.

ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తుల విశ్వాసం.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
మీ ఇంట్లో ఈ వస్తువులు అయిపోతే.. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, స్వామివారి పాదాల చెంత నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది.ఆ నీటినే భక్తులకి ప్రసాదంగా ఇస్తుంటారు.ఈ నీటిని మానసిక సమస్యలు ఉన్నవారికి తాగితే వారిలో మార్పు కచ్చితంగా వస్తుందని భక్తుల నమ్మకం.

Advertisement

ఈ ఆలయంలో భూత వైద్యం అనేది చేస్తుంటారు.ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లరు.

తీసుకెళ్తే వారికీ కీడు జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు.అలాగే ఆ ఆలయంకు వచ్చే భక్తులు మాంసం, మద్యం సేవించకూడదు, అయితే శనివారం, మంగళవారం మాత్రమే దెయ్యాలను వదిలించే పూజలు చేస్తారు.

అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదని అంటారు.ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.

తాజా వార్తలు