ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే టికెట్స్ ఎలా కొంటాం చెప్పండి కుదిరితే ఆన్లైన్లో బుక్ చేస్తాను లేదంటే థియేటర్ ముందు ఉన్న కౌంటర్లో టికెట్లు కొనుక్కుంటాం కానీ ఈ రెండు పద్ధతులు కాకుండా మొట్టమొదటిసారి థియేటర్ లోపల కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చిన సినిమా బాలకృష్ణ ( Balakrishna ) నటించిన నరసింహనాయుడు.( Narasimha Naidu ) ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అవుతే థియేటర్ల ముందు క్రౌడ్ తట్టుకోలేక ఆ క్యూలో జనాలు నిలబడితే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అని భయపడి టికెట్స్ థియేటర్ లోపల సీట్స్ లో కూర్చున్న వారికి ఇచ్చారు.
అంతటి పెను ప్రభంజనం సృష్టించింది నరసింహనాయుడు.
బి.గోపాల్ దర్శకత్వంలో( Director B Gopal ) వచ్చిన ఈ చిత్రం 2001లో విడుదల అయింది.ఈ సినిమా విజయానికి ముఖ్యమైన కారణం మని శర్మ అందించిన BGM అనే చెప్పాలి ఈ చిత్రాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తును మణిశర్మ సంగీతం నిలబెట్టింది.
సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు వంటి చిత్రాలను దాటి ఇండస్ట్రీ హిట్టుగా నిలబడింది.దాదాపు 75 సెంటర్లలో వంద రోజులు జరుపుకున్న నరసింహనాయుడు సినిమా ఫ్యాక్షన్ చిత్రాలకు ఒక మూలవిరాట్ వంటిది ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఫ్యాక్షని సినిమాలే ఇండస్ట్రీ నీ ఏలాయి.
ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అద్భుతంగా పండడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.ఇక జూన్ 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన నరసింహనాయుడు చిత్రాన్ని ఫోర్ కేలో మళ్లీ విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు ఈ విషయం తెలిసిన బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్ ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారట.మరి మొదటి సారి విడుదల చేసినప్పుడు సృష్టించిన కలెక్షన్స్ సునామి ఈ రెండో విడుదల లో జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy