బాలయ్య తెగువకు నోరెళ్లబెట్టడం ఖాయం!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు నేడు ప్రారంభమైంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలో నటిస్తుండటంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్రల కోసం తనను తాను మార్చుకున్న తీరును చూస్తే ప్రేక్షకులు అవాక్కవ్వడం ఖాయం.

ఈ సినిమా కోసం 60 ఏళ్ల బాలయ్య ఏకంగా 25 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.సినిమాలో బాలయ్య చేయబోయే పాత్రకు సన్నగా మారాల్సిందిగా దర్శకుడు బోయపాటి సూచించడంతో బాలయ్య వెంటనే కసరత్తులు మొదలుపెట్టి ఏకంగా 25 కిలోలు తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ వయసులో ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.మొత్తానికి బాలయ్య లాంటి సీనియర్ హీరోలు కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తుండటంతో హీరోల మధ్య పోటీ వాతావరణం నెలకొంది.

Advertisement

ఇక బాలయ్య సన్నబడ్డ వార్త ఎంతవరకు వాస్తవమో ఆయన ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది.కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరా, ఫ్యాక్షనిస్ట్ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు